Advertisement
Google Ads BL

మొత్తానికి మణికర్ణికతో మునక వేయించారు!


'గమ్యం' సినిమాతో టాలీవుడ్ లోకి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చిన క్రిష్ జాగర్లమూడి తీసిన ప్రతి సినిమాలో ఎదో ఒక సందేశాన్ని ప్రేక్షకులకి చేరవేస్తూ డీసెంట్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు. మొన్నామధ్యన బాలకృష్ణతో చారిత్రక నేపధ్యం వున్న 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రాన్ని తెరకెక్కించి హిట్ కొట్టిన క్రిష్ తాజాగా బాలీవుడ్ లో కంగనా రనౌత్ హీరోయిన్ గా ఝాన్సీ లక్ష్మి భాయ్ బయోపిక్ ని మణికర్ణికగా తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ పోస్ట్ ని కూడా విడుదల చేసిన క్రిష్ ఈ శుక్రవారం సాయంత్రం కంగనా రనౌత్ తో కలిసి కాశీలో గంగా నది ఒడ్డున పూజ కార్యక్రమాలు నిర్వహించాడు.

Advertisement
CJ Advs

ఇక చిత్ర షూటింగ్ ని కూడా ఈ పూజ కార్యక్రమాలతోనే మొదలు పెట్టేసారు. ఈ పూజ లో కంగనా నిజంగానే క్వీన్ మహారాణిగా వెలిగిపోతూ గంగానదికి పూజాది కార్యక్రమాలు నిర్వహించి గంగలో భక్తితో ఒక మునక వేసింది. ఈ మణికర్ణిక చిత్రాన్ని క్రిష్ తెలుగు, తమిళ్ లో కూడా విడుదల చేయనున్నాడు. అయితే నేషనల్ అవార్డు విన్నర్ కంగనా రనౌత్... 'కంచె'తో జాతీయ గుర్తింపు పొందిన క్రిష్ కాంబినేషన్లో వస్తున్న ఈ మణికర్ణిక చిత్రంపై భారీ అంచనాలే వున్నాయి. ఈ మణికర్ణిక చిత్రాన్ని క్రిష్ వచ్చే ఏడాది ఏప్రిల్ 27 న విడుదల చేస్తానని చెబుతున్నాడు. ఈ చిత్రానికి బాహుబలి కథకుడు విజయేంద్ర ప్రసాద్ కథని అందిస్తున్నారు. 

Manikarnika Movie Launched:

‘Manikarnika’ was launched in a grand ceremony in Varanasi, the sacred city. Kangana Ranaut who is going to play the lead character as ‘Manikarnika’, the queen of Jhansi has launched the film along with the director, the producer, the music directors, the writer and the principal team of ‘Manikarnika’.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs