రాజమౌళి కొడుకు కార్తికేయ గురించి ఇప్పటివరకు అంటే బాహుబలి విడుదలకు ముందు వరకు పెద్దగా ఎవరికీ తెలియదు. కానీ బాహుబలి చిత్రంలోని కొంత క్రెడిట్ ని రాజమౌళి తన కొడుకు కార్తికేయ కి ఇచ్చేశాడు. రాజమౌళి కొడుక్కి క్రెడిట్ ఇవ్వడం కాదుగాని కార్తికేయ కూడా బాహుబలి చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు. ఇక బాహుబలి చిత్రం టైటిల్ లో కూడా సెకండ్ యూనిట్ డైరక్టర్ గా కార్తికేయ పేరు కూడా పడింది. బాహుబలికి పనిచేయడమే కాకుండా కార్తికేయ కి ఇంకా ఇతర వ్యాపారాలు కూడా ఉన్నాయి. తండ్రి ఒక పక్క డైరెక్టర్ గా సెన్సేషన్ సృష్టిస్తుంటే మరో పక్క కార్తికేయ కూడా అటు వ్యాపార రంగంలో ఇటు సినిమా విషయంలో కూడా తండ్రికి ఏమాత్రం తీసిపోకుండా దూసుకుపోతున్నాడు.
పెయిడ్ గెస్ట్ హవుస్ నిర్వహణ, తండ్రి సినిమాలకు సంబంధించిన ట్రయిలర్ లు కట్ చేయడం, మేకింగ్ విడియోలు రెడీ చెయ్యడంలో కార్తికేయ దిట్ట. ఇవన్ని నిర్వహిస్తూనే ఇప్పుడు బాహుబలి చిత్రంతో కార్తికేయ మరో బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడని చెబుతున్నారు. బాహుబలి చిత్రానికి సంబందించిన సీడెడ్ హక్కులలో కార్తికేయ కి 40 శాతం వాటా ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. సాయి కొర్రపాటి, ఎన్వీప్రసాద్ లతో కలిసి కార్తికేయ సీడెడ్ లో బాహుబలి ద కంక్లూజన్ ని విడుదల చేసినట్లు చెబుతున్నారు. మరి బాహుబలి చిత్రం విడుదలైనప్పటి నుండి కలెక్షన్స్ వర్షం కురిపిస్తూ డిస్ట్రిబ్యూటర్స్ కి కాసుల పంట పండిస్తోనే వుంది. ఇక సీడెడ్ లో కూడా బాహబలి మొదటి వారానికి గాని 19 కోట్లకు పైగా వచ్చినట్లు ఇంకా పది, పన్నెండుకోట్లు రావాల్సి ఉందని సమాచారం.
మరి తండ్రి కేవలం డైరెక్టర్ గానే కోట్లు కొల్లగొడుతుంటే కొడుకు మాత్రం అనేక వ్యాపారాలు చేస్తూ తండ్రికి తగ్గ కొడుకుగా పేరు సంపాదించుకుంటున్నాడు.