Advertisement
Google Ads BL

జక్కన్న ఏమి చెప్పినా న్యూసే..!


ఒకప్పటి రాజమౌళి వేరు.. ఇప్పుడున్న రాజమౌళి వేరు. 'మగధీర' ముందు కేవలం తెలుగులో కొంత మీడియా మాత్రమే ఆయన్ను పట్టించుకునేది. 'మగధీర, ఈగ'ల తర్వాత దక్షిణాదిమొత్తం మాట్లాడింది. ఇక 'బాహుబలి' తర్వాత ఆయన ఏం మాట్లాడినా జాతీయ మీడియా, ఇంటర్నేషనల్‌ మీడియా కూడా దానిపై చర్చిస్తోంది. ఇక 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' తర్వాత ఆయన ఏ సినిమా చేయనున్నాడనే వార్తలు దేశవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశమయ్యాయి. 

Advertisement
CJ Advs

ఇక లండన్‌లో కూడా ఆయన మాట్లాడుతున్న మాటలపై పెద్ద ఆసక్తి మొదలైంది. అందరు స్టార్స్‌ రాజమౌళితో ఒక్క చిత్రం చేయాలని చూస్తుంటే.. జక్కన్న మాత్రం రజనీ సార్‌తో చేయడమే నాలక్ష్యమంటున్నాడు. ఆయనతో ఎప్పుడు చేస్తానో తెలియదు.. కథను బట్టే హీరోను ఎంపిక చేసుకుంటాను. ఆయనకు తగ్గ స్టోరీ రెడీ అయితే మాత్రం నా అదృష్టం అంటున్నాడు. అయినా విజయేంద్రప్రసాద్‌ వంటి రైటర్‌ ఎంతటి స్టార్‌ హీరోకైనా అనుకుంటే వారంలో కథ రెడీ చేయగలడు కదా..! మరోవైపు రజనీతో సినిమా చేస్తే పది రోజుల పాటు సినిమా థియేటర్లు కేకలతో, అరుపులతో అదిరిపోవాలి. 

డైలాగులే ఎవ్వరికీ వినిపించని స్థితి ఉండాలన్నాడు. మరోవైపు తన తండ్రి మంచి మలుపులతో స్టోరీ రాసిస్తే 'బాహుబలి3' గురించి ఖచ్చితంగా ఆలోచిస్తున్నానని తెలిపాడు. ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో అనుష్కలోని తపన, ఆమె టాలెంట్‌, దర్శకుల విజన్‌ను ఆమె అర్ధం చేసుకునే తీరు చూస్తుంటే ఆమెను మించిన వారు లేరని తాను ఫీలవుతున్నానని, చెప్పాడు. ఇలా మొత్తానికి ప్రస్తుతం ఇండియాలో మోస్ట్‌ వాటెండ్‌ డైరెక్టర్‌గా జక్కన్న మారిపోయాడు..! 

SS Rajamouli On Baahubali 3:

Rajamouli ‘I can’t cheat you by saying that there is no story for Baahubali 3. If my father has something in his mind and comes up with compelling idea or story written for part 3, I may be directing it’, Jakkanna hinted.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs