తాజాగా 'కాటమరాయుడు' బాహుబలి చిత్రాల రేట్లు భారీగా అమ్ముతుండటంతో ఈ చిత్రాలకు వచ్చే డబ్బుల్లో కొంత శాతాన్ని రైతుల సంక్షేమం కోసం ఇవ్వవచ్చు కదా..! అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. దీని ఉద్దేశ్యం చిత్ర నిర్మాతలు ఖచ్చితంగా ఇవ్వమని కాదు. రైతులు పడుతున్న కష్టాలు, తమిళనాడులో విశాల్ తీసుకున్న నిర్ణయం. వీరజవాన్ల హత్యలు వంటి వాటి నేపధ్యంలో తమ విధిగా భావించి నిర్మాతలు కొంత మొత్తాన్ని విరాళంగా ఇవ్వవచ్చు అనేది ఉద్దేశ్యం.
కానీ తమ్మారెడ్డి భరద్వాజ ఎందుకు ఇవ్వాలి? అని ప్రశ్నిస్తున్నాడు. చిరంజీవి, పవన్, ప్రభాస్... ఇలా ఏ హీరో అయిన మంచి పనులు చేసి పది మందికి ఆదర్శంగా ఉండమని చెప్పడం వితండ వాదన ఎలా అవుతుంది? ఇక్కడ అసలు పాయింట్ ఏమిటంటే.. సామాజిక బాధ్యతగా ఫీలవ్వమని తప్పితే ఇవ్వకపోతే చంపేస్తామని కాదు కదా..! ఇక 'బాహుబలి'కి విపరీతమైన రేట్లు అమ్ముతున్నారు.. ఇష్టం వచ్చినన్ని షోలు వేస్తున్నారు. ప్రభుత్వాలు కూడా ప్రోత్సహిస్తున్నాయని చెప్పడం తప్పేమికాదు. ఇది వాస్తవం. రైతుల సమస్యలు పట్టని చంద్రబాబుకు బాహుబలి బాధలు మాత్రం బాగానే గుర్తున్నాయి.
మన సత్తా చాటేది మన స్వయంసంపద, రైతన్నలు, యువత, పరిశోధకులు అని మరిచి, ఈ చిత్రం మనకు ప్రపంచంలో గర్వకారణంగా ఉందని చెప్పి, ప్రధానికి చెప్పి ఆస్కార్‌కి నామినేట్ అయ్యేలా చూస్తానంటున్నాడు. ఇక ఈ మధ్య ప్రతి హీరో సినిమాకి మొదటి రోజే ఇన్ని కోట్లు వచ్చాయి...అని చెప్పడం ట్రెండ్ అయిపోయింది. అంటే ముందు రోజు నుంచి ప్రదర్శించే బెనిఫిట్, ప్రీమియర్‌షోలతో కలిపి ఈ లెక్క వేస్తున్నారు.
కాకపోతే మరో మంచి పని ఏమిటంటే.. సినిమా రిలీజ్ డేట్ కంటే ఓ వారం ముందు నుంచే స్పెషల్‌షోలు వేసి, వారం తర్వాత రిలీజ్ చేసుకుని మామూలు రేటుకు అమ్మితే సామాన్య సినీ ప్రేక్షకుడికి రిలీఫ్‌గా ఉంటుంది. ఓ వారం రోజలు ముందు నుంచి కావాలంటే ఏ రేటుకైనా అమ్ముకోమనండి.. దాని ద్వారా సినిమా విడుదలకు ముందు ప్రీ రిలీజ్ బిజినెస్‌లాగా, సినిమా రిలీజ్‌కు ముందే 100, 200కోట్లు కలెక్షన్లు సాధించిన చిత్రాలుగా తమ తమ చిత్రాలను గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కించవచ్చు...! పబ్లిసిటీ కూడా వెరైటీగా ఉంటుంది....!