ఒకపక్క జగన్ రైతు దీక్ష సందర్భంగా జగన్ చేసిన వ్యాఖ్యలు, మరోవైపు చినబాబు సవాల్, పవన్ పంచ్‌లు, చంద్రబాబు నాటకాలు, కేసీఆర్ వ్యూహాలతో రాష్ట్ర రాజకీయాలు ఈ వేసవిని మించిన వేడిని రగిలిస్తున్నాయి. రోళ్లు పగిలే ఎండలో మరింత వేడిని, సెగను రాజేస్తున్నాయి. జగన్ తాజాగా మాట్లాడుతూ, చినబాబు లోకేష్‌బాబు పప్పు అని, ఆయన్ను అందరూ లో'క్యాష్' బాబు అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశాడు.
ద్రవోల్బణమని, ఖర్చులు పెరిగిపోతున్నాయని చెప్పే చంద్రబాబు పోలవరంతో పాటు హంద్రీ నీవా, పట్టిసీమ వంటి ప్రాజెక్ట్‌ల వ్యయాన్ని భారీగా పెంచాడని, మరి రేట్లు పెరగడం.. ద్రవ్యోల్బణం రైతులకు ఉండవా? వారికి రేటు పెంచాల్సిన పనిలేదా? అని కామెంట్ చేశాడు. మరోపక్క చినబాబు జగన్ తనమీద పప్పు, అవినీతిపరుడని ఆరోపణలు చేస్తున్నాడని, ఈ రెండింటితో తానేంటో చెప్పాలని, 24గంటలు టైమిస్తున్నానని హెచ్చరించాడు.
ఇక ఆనం బ్రదర్స్‌లో ఒకరైన వివేకా మాట్లాడుతూ, జగన్‌ని చూస్తుంటే తనకు 'ఒంగోలు గిత్త' చిత్రంలోని ప్రకాష్‌రాజ్ పాత్ర గుర్తుకొస్తోందని, మిర్చియార్డ్ చైర్మన్ అయిన ప్రకాష్‌రాజ్ ఉదయాన్నే వచ్చి రైతుల బాధలు విని కంటతడిపెడతాడని, సాయంత్రమైతే గుడ్డలు తీసేసి హాయిగా మందుకొడతాడని, దీక్ష తర్వాత జగన్ లోటస్‌పాండ్‌లో ఇవే చేస్తాడంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. పవన్ మిర్చిరైతుల విషయంలో గుంటూరు మిర్చి కంటే ఘాటుగా ప్రశ్నలు సంధించాడు. చంద్రబాబు తాజాగా తన కొడుకు తప్పులు మాట్లాడుతూ, నోరు జారడంపై క్లాస్‌పీకాడని, పారిశ్రామిక పెట్టుబడుల కోసం వెళ్లే వారి జాబితాలో నుంచి హఠాత్తుగా లోకేష్ పేరు తీసేయడం చర్చనీయాంశం అయింది.
ఇక పారిశ్రామిక వేత్తలపై ఉన్న మమకారం రైతులపై ప్రభుత్వాలకు లేవని, చంద్రబాబు విదేశీ పర్యటనను దృష్టిలో ఉంచుకునే పవన్ వ్యాఖ్యలు చేశాడంటున్నారు. మరోవైపు మిగులు కరెంటు తక్కువ ధరకు వస్తున్నా కూడా చంద్రబాబు లగడపాటికి చెందిన లాంకో పవర్ ప్లాంట్ నుంచి ఎక్కువ ధరకు కరెంట్ కొనడానికి ఓకే చెప్పగా, కేసీఆర్ మాత్రం లగడపాటికి షాకిచ్చాడు. ఇలా పలు అంశాలతో రాష్ట్ర రాజకీయాలు భగ్గుమంటూ పొయ్యి లోంచి పెన్నంలోకి, పెన్నంలోంచి పొయ్యిలోకి పడుతున్నాయి.