మురుగదాస్ దర్శకత్వంలో టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్‌బాబు 'స్పైడర్' చిత్రం ప్రారంభమై ఏడాది అయింది. 'బ్రహ్మోత్సవం' డిజాస్టర్ తర్వాత మహేష్ తీసుకుంటున్న పలు జాగ్రత్తలు, ఇక ఈ చిత్రంతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నందు వల్ల ఈ చిత్రం షూటింగ్‌లో జాప్యం జరుగుతోంది. కాగా ఈ చిత్రం వియత్నాంతో పాటు ఇతర షెడ్యూల్స్ పూర్తి చేసుకుని ఈ రోజు నుండి హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ ప్రారంభించింది.
ఈ షెడ్యూల్‌తో టాకీపార్ట్ పూర్తవుతుంది. ఆపై జూన్‌లో పాటలను చిత్రీకరించి, ఆగష్టు11న విడుదల చేసే యోచనలో యూనిట్ ఉంది. ఆగష్టు11న అయితే లాంగ్ వీకెండ్ వస్తుంది. దానిని సద్వినియోగం చేసుకోవాలని మహేష్, మురుగదాస్‌లు చూస్తున్నారు. అయితే మరోపక్క అజిత్-శివల దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ 'వివేగం' జులైలో విడుదల చేయాలని భావించారు. కానీ ఈ చిత్రాన్ని ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుగా తేవాలని ఆ చిత్రం యూనిట్ కూడా భావిస్తోంది. అదే జరిగితే కోలీవుడ్‌లో సూపర్‌ఫాలోయింగ్ ఉన్న అజిత్ దెబ్బకు కొత్తగా స్ట్రెయిట్ మూవీతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మహేష్‌కు తమిళనాడులో చాలా ఇబ్బందులే ఎదురయ్యే పరిస్థితులు ఏర్పడేలా ఉంది.
మరి ఈ విషయంలో మురుగదాస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి..! ఇక తాజాగా ఈ చిత్రానికి హరీస్‌జైరాజ్ ఇచ్చిన ఓ మంచి ట్యూన్‌కి రామజోగయ్యశాస్త్రి ఓ సెటైర్ లైన్‌ను రాశాడట. ఇటీవల టిడిపికి చెందిన జలీల్‌ఖాన్ మాట్లాడిన బికాంలో ఫిజిక్స్‌ను వినిపించేలా ఆయన 'బీకాంలో ఫిజిక్స్ వుండవచ్చు గానీ.. నీ సోకుల కొలతల్లో తేడాలుండవ్' అంటూ రాశాడట. చూద్దాం.. రేపు చిత్రం విడుదలైన తర్వాత ఈ సెటైర్ ఎలా పేలుతుందో..?