Advertisement
Google Ads BL

జక్కన్నకు సాహో అంటున్నారు..!


'బాహుబలి-ది బిగినింగ్‌' రిలీజ్‌ అయినప్పుడు కూడా భారీ అంచనాలే ఉన్నాయి. కానీ కాస్త ఆనుమానం ప్రజల్లో ఉండేది. ఇక ఇతర భాషల్లో పెద్దగా అంచనాలు లేవు. రాజమౌళి సత్తా తెలిసిన టాలీవుడ్‌ ఆడియన్స్‌ మాత్రం ఈ చిత్రంతో రాజమౌళి ఏదో సంచలనం సృష్టించడం ఖాయమని భావించారు. అనుకున్నదే జరిగింది. ఏమని వర్ణించనూ.. అనే తరహాలో ప్రభంజనం సృష్టించి ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద కీర్తిపతాకాన్ని ఎగురవేసింది. 

Advertisement
CJ Advs

దాంతో 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా మారింది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే దేశవ్యాప్తంగా ఎన్నో ఆశలు రేకెత్తించింది. కానీ కొందరు మాత్రం రాజమౌళిని తేలిగ్గా తీసిపారేశారు. అయితే ఈ సెకండ్‌ పార్ట్‌ విడుదలైన వెంటనే ప్రపంచం యావత్తు 'బాహుబలి' మేనియాలో పడిపోయారు. తనదైన ఎమోషన్స్‌ని పీక్స్‌కి చూపిస్తూ, ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ను ఇరగదీసిన రాజమౌళికి ఇప్పుడు దేశ, విదేశాలలోని ప్రేక్షకులు పట్టం కడుతున్నారు. 

ఓ డబ్బింగ్‌ చిత్రం ఈ విధంగా కోలీవుడ్‌, బాలీవుడ్‌ అనే తేడా లేకుండా స్వైర విహారం చేస్తోంది. సాధారణంగా బాలీవుడ్‌ చిత్రాలు కనీసం 20 రాష్ట్రాలకు పైగానే రిలీజ్‌ అవుతాయి. కానీ ఓ ప్రాంతీయ చిత్రం ఈ స్థాయిలో రికార్డులు బద్దలు చేయడం కనివినీ ఎరుగని సంగతి. ఇక చిత్రంలోని చిన్న చిన్న లోపాలను పక్కనపెడితే, హిందీ చిత్రాలకే సాధ్యంకాని 1000కోట్ల మార్కును 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌' చిత్రం సాధించడం ఖాయమైపోయింది. కేవలం మూడు నాలుగు రోజుల్లోనే ఏకంగా 600కోట్ల దాకా వసూలు చేసింది. సాహో.. జక్కన్న...! 

Rajamouli is a Great Director in Tollywood:

'Baahubali The Beging' Releasing day More expectations on Film. But 'Baahubali The Conclusion' film situation totally changed different. After releasing movie total country peoples fall down and impressing in baahubali 2 movie because this peoples says Rajamouli is a one of the great director.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs