Advertisement
Google Ads BL

బాహుబలి బాలీవుడ్ బాక్సాఫీస్ వెనుక రహస్యం..!


బాహుబలి చిత్రం ప్రపంచం మొత్తంలో వసూలు చేస్తున్న కలెక్షన్స్ ఒక ఎత్తైతే బాలీవుడ్ లో కలెక్షన్స్ వసూలు ఒక ఎత్తు. కేవలం బాలీవుడ్ సూపర్ స్టార్స్ గా వెలుగొందుతున్న ఖాన్స్ త్రయం అమీర్ ఖాన్, షారుఖాన్, సల్మాన్ ఖాన్స్ కి మాత్రమే సాధ్యమయ్యే బాక్సాఫీస్ రికార్డులను ఒక డబ్బింగ్ చిత్రంగా విడుదలైన బాహుబలి తుడిచి పెట్టేస్తోంది. అయితే బాలీవుడ్ లో బాహుబలి ఇంతిలా ప్రభంజనం సృష్టించడానికి మాత్రం ఒక వ్యక్తి కారణమట. అసలు బాహుబలి ని బాలీవుడ్ కింగ్ మేకర్ గా వెలుగొందుతున్న కరణ్ జోహార్ తీసుకున్నాడు.... అంటే దాని వెనుక బాహుబలి విలన్ భళ్లాల దేవుడు రాణా హస్తం ఉందని బాహుబలి డైరెక్టర్ రాజమౌళి గర్వంగా చెప్బుతున్న మాట. 

Advertisement
CJ Advs

అదెలా అంటే 'బాహుబలి ద బిగినింగ్' తీసేటప్పుడే బాహుబలిని బాలీవుడ్ లోకి దించాలనే మాస్టర్ ప్లాన్ ని రెడీ చేశాడట రాజమౌళి. అయితే అక్కడ ఎవరో ఒకరు బాహుబలిని తీసుకుంటే పెద్దగా పేరు రాదనీ.... ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి తీసుకుంటేనే పేరొస్తుందని అనుకుంటుంటే ఇంతలో భళ్లాల దేవుడు రాణా కలగజేసుకుని తనకి బాలీవుడ్ బడా దర్శక నిర్మాత కరణ్ జోహార్ తో పరిచయం ఉందని... ఆయనైతేనే బాహుబలి కి న్యాయం చేయగలడని.. చెప్పగా దానికి రాజమౌళి ఒకే చేసేసి కరణ్ జోహార్ ని కలిసి బాహుబలి గురించి వివరించి.... కొన్ని సీన్స్ కరణ్ కి వేసి చూపెట్టి మరీ...  బాహుబలికి  నిర్మతగా చెయ్యగలిగారట.

ఇక అలా బాహుబలికి బాలీవుడ్ లో నిర్మాత దొరకడంతో పాటే రానా బాలీవుడ్ లో మిగతా పరిచయాలతో కూడా బాహుబలి గురించి గొప్పగా చెప్పడం... ఏ ఈవెంట్ కి హాజరైనా కూడా అక్కడ బాహుబలి గురించి వారికి చెప్పడం.. బాహుబలి అంటే ఒక సునామి అని వారికి చెప్పడంతో బాహుబలికి విపరీతమైన క్రేజ్ వచ్చిందని కేవలం బాలీవుడ్ లో రానాకున్న పరిచయాలే బాహుబలి హిట్ కి కారణమయ్యాయని రాజమౌళి రాణాని ఆకాశానికెత్తేస్తున్నాడు.

Baahubali is the Secret Behind Bollywood Box Office ..!:

Rajamouli has done a master plan to get Baahubali into Bollywood when it is going to be 'Baahubali Launching'. However, if someone is going to take the name of a bad guy .... If someone wants to be a big person, the god of the goddess Rana has come in contact with Bollywood buffer director Karan Johar ... he can do justice to Bahubali ... Karan Johar was briefed about Bahubali
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs