Advertisement
Google Ads BL

బాహుబలితో ఈయనకి టెన్షన్ మొదలైంది!


బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై కలెక్షన్స్ విషయంలో ప్రభంజనం సృష్టిస్తుంది. బాహుబలితో మోస్ట్ వాంటెడ్ డైరెక్షర్స్ లిస్ట్ లోకి చేరిపోయాడు రాజమౌళి. ఇక బాహుబలి చిత్రంపై విమర్శకులు సైతం ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే బాహుబలి సంగతి ఇలా ఉంటే మరో పక్క రోబో 2.0 పై కూడా ఆసక్తి పెరిగిపోతుంది జనాలకు. సౌత్ లో భారీ చిత్రాలను తెరకెక్కించే దర్శకుడిగా పేరు మోసిన  డైరెక్షర్స్ లో శంకర్ ఒకరు. ఆయన భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కిస్తూ అందరి చూపు తన మీదే ఉండేలా చూసుకుంటాడు. 

Advertisement
CJ Advs

అలాంటి శంకర్ కూడా ఇప్పుడు బాహుబలిపై పొగడ్తల జల్లు కురిపిస్తున్నాడు. ఇంతకు ముందే బాహుబలి చిత్రాన్ని చూసాను... ఇండియన్ సినిమా గర్వపడేలా సినిమా తీశారు... అందం, అభినయం, మేకింగ్, మ్యూజిక్, గ్రాఫిక్స్,విజువల్ వండర్ గా  ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.... ఇంత గొప్ప సినిమా తీసిన రాజమౌళి కి అతని టీమ్ కి నా అభినందనలు అంటూ ట్విట్ చేసాడు. మరోపక్క శంకర్ తెరకెక్కించే 2.0 చిత్రం షూటింగ్ కొద్దిగా ఆలస్యమై కొన్ని కారణాల చేత జనవరికి పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. రోబో చిత్రం తర్వాత శంకర్  తీసిన 'ఐ' సినిమా ప్లాపయినప్పటికీ  2.0 మీద ఆ ఎఫెక్ట్ ఏమాత్రం పడకుండా  2.0 మీద విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

మరి ఒక బిగ్ ప్రాజెక్ట్ బాహుబలి విడుదలై విజయవంతమవడంతో ఇప్పుడు శంకర్ కి కాస్త టెంక్షన్ ఎక్కువైందట. అందుకే  2.0 విషయంలో చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు శంకర్ అని చెబుతున్నారు.

Shankar Reaction After Watching Baahubali 2 Movie:

'Just saw Bahubali 2 – The pride of Indian Cinema. What a Bravery,Beauty, Grandness & Music.. Awestruck. Hats off to ‘Raja’mouli artsts n team,' Shankar tweeted.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs