దేశంలో ఇపుడెక్కడ చూసిన బాహుబలి గురించే వినబడుతుంది. అంతలా హాట్ టాపిక్ అయ్యింది బాహుబలి. బాహుబలిని తెరకెక్కించిన రాజమౌళి దగ్గర నుండి అందులో నటించిన ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ తదితరుల గురించి పెద్ద చర్చే నడుస్తుంది. బాహుబలికి ముందు... బాహుబలికి తర్వాత సినిమా ఇండస్ట్రీ అంటూ మాట్లాడేసుకుంటున్నారు. విడుదలైన మొదటిరోజే 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఇండియన్ బాక్సాఫీస్ లో చరిత్ర సృష్టించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇంత పెద్ద సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ ని ఎవరితో తెరకెక్కిస్తాడో అని కూడా చర్చ స్టార్ట్ అయ్యింది.
అయితే రాజమౌళి ఫ్యామిలీ విశ్రాంతి కోసం భూటాన్ వెళ్లారని సమాచారం. ఇక ఈ హాలీడే ట్రిప్ ముగియగానే రాజమౌళి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని తెరకెక్కించబోతున్నాడని.... అతి తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాని తియ్యబోతున్నాడనే టాక్ మొదలైంది. అయితే హీరో ఎవరన్నది క్లారిటీ లేదుగాని.... ప్రస్తుతం వార్తలైతే అల్లు వారబ్బాయి అల్లు అర్జున్ హీరో అంటున్నారు.
ఎటువంటి గ్రాఫిక్స్ కి తావివ్వకుండా పూర్తి కథతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ హీరో అని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఇప్పుడు అల్లు అర్జున్ డీజే చిత్రంలో చేస్తున్నాడు. ఇక దీని తర్వాత వక్కంతం డైరెక్షన్లో నా పేరు సూర్య... చిత్రంలోనూ... తమిళ డైరెక్టర్ లింగుస్వామి డైరెక్షన్ లోను కమిట్ అయిన అల్లు అర్జున్ ఇప్పుడు రాజమౌళి కోసం ఏ చిత్రాన్ని త్యాగం చేస్తాడో.....చూడాలి. మొత్తానికి జక్కన్న తర్వాతి సినిమాలో బన్నీనే హీరో అనే ప్రచారం మాత్రం గట్టిగానే జరుగుతుంది.