నేడు కర్త, కర్మ, క్రియ అయి.. సినిమాను నడిపించే కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్లను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారు. ప్రస్తుతం స్టార్‌డమ్ హవా, హీరోల డామినేషన్ నడుస్తోంది. ఎంత ఫ్లాపుల్లో ఉన్న స్టార్‌కి హిట్టిచ్చినా కూడా క్రెడిట్ మొత్తం ఆయా స్టార్స్‌కే వెళ్లిపోతోంది. చిత్రాన్ని జనరంజకంగా తీర్చిదిద్దిన దర్శకులకు హీరోలే కాదు.. స్టార్స్ కూడా తగిన గుర్తింపు ఇవ్వడం లేదు. అందుకే ఏ ప్రాబ్లమ్ లేకుండా పెద్దగా స్టారడమ్ లేని దర్శకులతో చిత్రాలు చేయాలని భావిస్తున్నారు.
క్రెడిట్ ఏ మాత్రం దర్శకునిగా వెళ్లినా తట్టుకోలేకపోతున్నారు. ఇలాంటి తరుణంలో కేవలం తన పేరును, తన రాజ ముద్రను మాత్రమే స్టార్‌డమ్‌గా మార్చిన ఘనత నేటితరం దర్శకుల్లో రాజమౌళికి దక్కుతుంది. ఏ చిత్రం చేసినా హీరోలకు సరిసమానంగా వీలుంటే ఓ ఆకు ఎక్కువగానే రాజమౌళికి క్రెడిట్‌పడుతుంది. అందరూ హీరోలను మర్చిపోయి ఇట్స్ ఏ రాజమౌళిస్ ఫిలిం అనే స్థాయికి వచ్చింది. దాంతో చాలా మంది సోకాల్డ్ స్టార్స్ ఆయనతో చిత్రాలు చేయడానికే జంకుతున్నారు. ఇలాంటి సమయంలో 'బాహుబలి' పెద్ద హిట్టయినా కూడా తనకంటే రాజమౌళికే ఎక్కువ పేరు వస్తుందన తెలిసినా కూడా ప్రభాస్ ఐదేళ్లు ఆయనకే రాసిచ్చాడు.
అనుకున్నట్లు గానే ఈ చిత్రం రెండు భాగాలు ప్రబాస్‌ని దేశవిదేశాలలో స్టార్‌ని చేసేశాయి. చిరంజీవితో సహా ఏ హీరో కూడా అధిగమించలేని పాపులారిటీని, బాక్సాఫీస్ హిట్‌ని ఇచ్చాయి. ప్రస్తుతం బాక్సాఫీస్ పరంగా తీసుకుంటే మిగిలిన స్టార్స్ కంటే ప్రభాస్ ఎంతో ఎత్తులో ఉన్నాడు. కానీ ఆయన స్టామినానను కేవలం 'బాహుబలి'తో చెప్పలేం. చెప్పలేని, ఊహించలేని ప్రఖ్యాతినితెచ్చిన 'బాహుబలి' తర్వాత ప్రభాస్ యంగ్ డైరెక్టర్ సుజీత్‌తో 'సాహో' చిత్రం చేస్తున్నాడు. దర్శకుడు ఎవరైనా వారు చెప్పినట్లు నడుచుకునే స్టార్‌గా ప్రభాస్‌కి పేరుంది.
ఆయన దర్శకుల హీరో. మరి 'సాహో' చిత్రం సాధించే విజయం క్రెడిట్ మొత్తం ఎవరెన్ని చెప్పినా ప్రభాస్ ఖాతాలోనే పడుతుంది. అందునా రాజమౌళితో ఓ చిత్రం చేస్తే తర్వాత వరస పరాజయాలు ఎదురవుతాయనే సెంటిమెంట్ ఉంది.వీటిని అధిగమించి 'సాహో'తో ప్రభాస్ ఏమి సాధిస్తాడనేది దాని మీద అతని నిజమైన స్టామినా ఆధారపడివుందని చెప్పవచ్చు.