Advertisement
Google Ads BL

సీరత్‌ కపూర్.. సీన్‌ బాగుంది..!


టాలీవుడ్‌లో హీరోలకు పక్షపాతం ఉంటుందేమో గానీ.. హీరోయిన్ల విషయంలో మాత్రం మన ప్రేక్షకులు ఉదారంగా వ్యవహరిస్తూ ఉంటారు. తమిళం, మలయాళం, కన్నడ, పంజాబీ.. ఇలా ఎవరైనా మన నేటివిటీతో కనిపిస్తే నెత్తినపెట్టుకుంటారు. అందుకోసమే ఉత్తరాది భామలు కూడా తెలుగమ్మాయిలలా కనిపించేందుకు నానా తంటాలు పడుతుంటారు. కానీ తాజాగా ఓ కెన్యాకి చెందిన ఇండియన్‌ భామ మాత్రం తెలుగు నేటివిటీకి అసలు సంబంధమే లేకుండా కనిపిస్తూన్నా కూడా పిలిచి అవకాశాలు ఇస్తున్నారు. 

Advertisement
CJ Advs

ఆమే సీరత్‌ పూర్‌.. శర్వానంద్‌ సరసన 'రన్‌ రాజా రన్‌'తో ఆ భామ తెలుగులోకి అడుగుపెట్టింది. ఆ చిత్రం హిట్టయినా ఈ అమ్మడికి ఒరిగిందేమీ లేదు. ఆ తర్వాత 'టైగర్‌, కొలంబస్‌' చిత్రాలలో నటించింది. ఈ రెండు చిత్రాలు ఢమాలుమన్నాయి. దీంతో ఈ భామకు ఇక ఐరన్‌లెగ్‌ ముద్ర ఖాయమని అందరూ భావించారు. కానీ ఈ అమ్మడు మాత్రం కాస్త లేటయినా ఏకంగా ఓ సీనియర్‌ హీరోని, అందునా టాలీవుడ్‌ మన్మధుడిని ఆకట్టుకుంది. దీంతో ఈమెకు ఓంకార్‌ దర్శకత్వంలో సమంత కీలకపాత్రలో 'రాజుగారి గది'కి సీక్వెల్‌గా వస్తోన్న 'రాజుగారి గది2'లో అవకాశం లభించింది. 

ఇక ప్రస్తుతం 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' తర్వాత దర్శకుడు వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో అల్లు శిరీష్‌ హీరోగా రూపొందుతున్న సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రంలో కూడా అవకాశం వచ్చింది. ఇప్పటికే 'టైగర్‌' తో పాటు ఆమెను కరుణించిన ఈ తాజా చిత్రంలో వి.ఐ.ఆనంద్‌ అవకాశం ఇచ్చాడంటే ఈ అమ్మడు తెరపైనే కాదు.. తెర వెనుక కూడా అందరినీ బాగానే ముగ్గులో వేసుకుంటోందని అర్దమవుతుంది. మరి ఈ రెండు చిత్రాలు హిట్టయితే ఇక ఈ అమ్మడి దశ తిరగడం ఖాయంగా కనిపిస్తోంది...! 

Seerat Kapoor Getting Chance in Raju Gari Gadhi 2 :

Seerat Kapoor entered the Telugu version with the 'Run Raja Run' Hero Sharvanand. But this is a bit of a bit too good, but it is a senior hero. She was given a chance at the 'Raju Gari Gadhi 2' which was a sequel to Samantha's main role in 'Raju Gari Gadhi 2'.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs