నిజమే.. రాజమౌళి ఉరఫ్ జక్కన్న 'బాహుబలి'తో చరిత్రను తిరగరాస్తున్నాడు. ఈ చిత్రంపై ఎన్టీఆర్, ధనుష్, శివకార్తికేయన్, మహేష్... ఇలా అందరూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. తెలుగు వాడి సత్తాను చాటినందుకు అభినందిస్తున్నారు. స్వయాన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు కూడా 'బాహుబలి-ది కన్‌క్లూజన్' చిత్రం తెలుగు వారి సత్తాను చాటిచెప్పిందని అభినందించారు. నిజమే.. ఈ చిత్రం తెలుగు వారి సత్తాను చాటిచెప్పింది.
కానీ కరణ్‌జోహార్ వంటి వారైతే మరింత అతిశయోక్తుల మాట్లాడుతున్నారు. 'మొఘల్ ఏ ఆజమ్' తర్వాత అంతటి గొప్ప చిత్రం ఇదేనని, భారతదేశంలోనే రాజమౌళినే బెస్ట్ అంటున్నారు. కరణ్‌జోహార్ ఈ చిత్రానికి బాలీవుడ్ నిర్మాత అయి వుండవచ్చు. కానీ ఏకంగా రాజమౌళిని దిబెస్ట్ అనడం సబబు కాదు. వన్ ఆఫ్ ది బెస్ట్ అనవచ్చు. ఎందుకంటే దక్షిణాదిలో ప్రస్తుతం ఉన్న దర్శకుల్లో మణిరత్నం, శంకర్, బాలీవుడ్‌లో ప్రతి చిత్రంలోనే కమర్షియల్ అంశాలను మిస్ కాకుండానే ఏదైనా నీతి చెప్పాలని తహతహలాడే రాజుకుమార్ హిర్వాణి వంటి దర్శకులు ఇంకా బతికే ఉన్నారు. మొదట మనం తెలుగు వారమే కాబట్టి రాజమౌళిని కీర్తించవచ్చు. కానీ ముందుగా మనం భారతీయులం.. ఈ విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది...!