కళాతపస్వి కాశీనాధుని విశ్వనాధ్ వయోభారంతో ఉన్నారు. ఇంతకాలానికి ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. ఈ సందర్భంగా చిరంజీవి వెళ్లాడు. ఆ సమయంలో విశ్వనాథ్ గారు ఫోన్‌లో ఎవరితోనో అర్జంట్‌గా మాట్లాడుతున్నారు. ఆయన ఫోన్ మాట్లాడుతున్నంత సేపు చిరంజీవి గౌరవంగా నిలబడే ఉన్నారు. ఇక పవన్‌కళ్యాణ్ ఆయనకు, ఆయన శ్రీమతికి పాదాభివందనం చేశాడు. త్రివిక్రమ్-పవన్‌లు కలిపి ఆయన తీసిన ఆణిముత్యాలలో నుంచి ఓ 12 చిత్రాలను ఓ ఆల్బమ్‌గా తేనున్నామన్నారు. గ్రేట్..
కానీ ఆయన తీసిన చిత్రాలలోంచి 12 చిత్రాలను ఎంచుకోవడం చాలాకష్టం. ఏ చిత్రాన్ని పక్కనపెడతారు? అన్ని ఆణిముత్యాలే కదా..! ఇక్కడ చిరంజీవిని, పవన్‌ని పొగడటం లేదు. వారిని అభినందిస్తున్నామంతే.. దీనికి కూడా కులం రంగు పులమవద్దు. కానీ నేడు కళాఖండాన్ని తీశానని చెప్పుకుంటున్న రాజమౌళి, రాఘవేంద్రరావు వంటి వారు సినిమా ప్రమోషన్‌లో ఎంత బిజీగా అయినా ఉండవచ్చు. కానీ ఆయన కోసం ఓ ఐదు నిమిషాలు సమయం కేటాయించలేరా? ఇక దాసరికి అనారోగ్యం అని భావిద్దాం.
కానీ ఆయన చిత్రాలు తీసే సమయంలో ఆయన్ను ఎరిగిన వారు.. ఆయన సమకాలీనులు, ఆయన చిత్రాలలో నటించిన వారు, ఆయన గొప్పతనం తెలిసిన వారు ఎందరో ఉన్నారు. పేర్లు పెట్టి చెప్పనక్కరలేదు.. వీరంతా ఒక్కసారైనా ఆయన్ను కలిసి ఓ పూలమాల, శాలువా ఇచ్చి శుభాకాంక్షలు తెలిపితే ఏమవుతుంది? వారి గొప్పతనం తగ్గిపోతుందా? పోనీ ఆయనకు పాదాభివందనం చేయడం ఇష్టం లేకుంటే, వారి ఇగోలు అడ్డువస్తే, ఆయనకంటే మేమే గొప్పవారిమని భావిస్తే, కనీసం ఓ పలకరింపు చాలు కదా...! ఫ్లవర్‌బోకేలకు, శాలువాలకు కూడా వాళ్ల దగ్గర డబ్బులే లేవా...? విరాళాలు సేకరించి ఇవ్వమంటారా?