Advertisement
Google Ads BL

అర్జున్‌ కోసం అర్జున్‌ని ఒప్పించాడట..!


ప్రస్తుతం అల్లు అర్జున్‌ దిల్‌రాజు నిర్మాతగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో 'డిజె' (దువ్వాడ జగన్నాథం) చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే బన్నీ స్టార్‌ రైటర్‌ వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ లగడపాటి శ్రీధర్‌ నిర్మాణంలో 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' అనే చిత్రం చేయనున్నాడు. దేశభక్తి ప్రేరేపితమైన ఈ సబ్జెక్ట్‌కి సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తయింది. కాగా ఇందులో నాటి యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ విలన్‌గా నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. 

Advertisement
CJ Advs

కాగా గతంలో యాక్షన్‌ హీరోగానే కాకుండా తన స్వీయ దర్శకత్వంలో దేశభక్తి చిత్రాలను తీసిన అర్జున్‌ ఈ చిత్రానికి ఓకే చెప్పాడట.కానీ ఇందులో అర్జున్‌ పాత్ర విలన్‌ కాదని, బన్నీకి తండ్రి పాత్ర అని సమాచారం. దాంతో గతంలో 'సన్నాఫ్‌ సత్యమూర్తి' చిత్రంలో ఉపేంద్ర పోషించిన పాత్రను చేయడానికి కూడా నో చెప్పిన యాక్షన్‌ కింగ్‌ తాను ఇప్పుడే తండ్రి పాత్రలు చేయదలుచుకోలేదని, దాంతో ఈ చిత్రంలో తాను నటించనని చెప్పాడట.

వెంటనే రంగంలోకి దిగిన బన్నీ తండ్రి అల్లు అరవింద్‌ అర్జున్‌కి ఫోన్‌ చేసి.. ఇందులో హీరో తండ్రి పాత్ర అద్భుతంగా ఉంటుంది. హీరోకి సరిసమానంగా క్యారెక్టర్‌ ఉంటుంది. ఇటీవల ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన 'జనతా గ్యారేజ్‌' చిత్రంలోని మోహన్‌లాల్‌ పాత్ర కంటే బాగుంటుందని హామీ ఇవ్వడంతో యాక్షన్‌ కింగ్‌ సరేనన్నాడని సమాచారం. మొత్తానికి ఈ చిత్రానికి యాక్షన్‌కింగ్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌ కానున్నాడు. 

Allu Aravind Request to Action King Arjun!:

Currently, Hero Allu Arjun is acted film 'DJ' (Duvvada Jagannatham) directed by Harish Shankar and Producer by Dilraju. Lagadapati Sridhar is producing 'My name Surya .. My house India' movie in this action king Arjun is going to act as a villain.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs