Advertisement
Google Ads BL

ఎన్టీఆర్-త్రివిక్రమ్ లకు హీరోయిన్ సెట్టయింది!


ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా ఉంటుందని అధికారికంగా కూడా ప్రకటన వచ్చింది. ఎప్పటినుండో త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించాలనే ఎన్టీఆర్ కోరిక  ఇన్నాళ్లకు నెరవేరబోతోంది. ప్రకటన అయితే వచ్చింది కానీ... సినిమా ఎప్పుడు ఉంటుందో అనేదాని మీద ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఎందుకంటే త్రివిక్రమ్ ప్రస్తుతానికి  పవన్ హీరోగా ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆ చిత్రం ఎప్పటికి పూర్తవుతుందో.. కానీ షూటింగ్ మాత్రం శరవేగంగా జరుపుకుంటుంది. అలాగే ఎన్టీఆర్ కూడా బాబీ డైరెక్షన్ లో జై లవ కుశలో నటిస్తున్నాడు ఇక ఈ చిత్రం ఆగష్టు లో రిలీజ్ అంటున్నారు.

Advertisement
CJ Advs

ఎన్టీఆర్ జై లవ కుశ పూర్తవ్వగానే త్రివిక్రమ్ సినిమాకి ఎన్టీఆర్ పూర్తిగా ఫ్రీ అయిపోతాడు.  మరి పవన్ సినిమా అయ్యేవరకు త్రివిక్రమ్ ఫ్రీ అవ్వడు . అప్పటివరకు ఎన్టీఆర్ ఎదురు చూడాల్సిందే. సరే అదంతా అలా వుండగా ఇప్పుడు ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్లో నటించే హీరోయిన్ పేరు తెర మీదకి వచ్చింది. కృష్ణగాడి వీర ప్రేమ గాధ హీరోయిన్ మెహ్రీన్ ని వీరి ప్రాజెక్ట్ లో హీరోయిన్గా ఎంపిక చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోపక్క మెహ్రీన్ వరుసగా రెండు పెద్ద చిత్రాలు అవకాశాలు కోల్పోవడమో? లేకపోతె ఆమె తప్పుకోవడంతోనో గాని రెండు ఛాన్స్ లు మిస్ చేసుకున్నట్లు ప్రచారం జరిగింది.

అయితే మెహ్రీన్, ఎన్టీఆర్ చిత్రంలో నటించడంకోసమే ఆ ఆఫర్స్ ని వదులుకున్నట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్ సినిమా కోసం డేట్స్ అడ్జెస్ట్ చెయ్యలేకే ఆ సినిమాల్లో ఆఫర్స్ వదులుకుందట. ప్రస్తుతానికి మెహ్రీన్ చేతిలో సాయి ధరమ్ హీరోగా చేస్తున్న 'జవాన్' మాత్రమే వుంది.

Mehreen Teams up with NTR!:

Young Tiger Ntr will be teaming up with ace director Trivikram soon. An interesting update on the project is that Mehreen Pirzada will romance Ntr in this crazy film.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs