Advertisement
Google Ads BL

ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నా డైరెక్టర్!


గత ఏడాది 'పెళ్లి చూపులు' చిత్రం ఎటువంటి అంచనాలు లేకుండా చాలా సైలెంట్ గా విడుదలై భారీ విజయాన్ని మూటగట్టుకుని విజయకేతనం ఎగురవేసింది. మొదటిసారి దర్శకత్వం వహించిన తరుణ్ భాస్కర్ ని సినిమా ఇండస్ట్రీ మొత్తం ప్రశంసల జల్లు కురిపించింది. చిన్న చిత్రంగా విడుదలై భారీ హిట్ ని సొంతం చేసుకోవడమే కాకుండా ఈ చిత్రం జాతీయ పురస్కారాన్ని అందుకోవడం కూడా సంచలనమే అయ్యింది. 'పెళ్లి చూపులు' విడుదలై చాలా నెలలు గడుస్తున్నా ఆ దర్శకుడు మరో సినిమా చెయ్యలేదు. 

Advertisement
CJ Advs

ఎట్టకేలకు తరుణ్ భాస్కర్ తన రెండో సినిమాని పూర్తి  కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించబోతున్నాడట.  ఆ చిత్రం బాలీవుడ్ లో అమీర్ ఖాన్ నటించిన  'దిల్ చాహత హై' తరహాలో ఉండబోతుందని అంటున్నారు. అయితే ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పనుల్లో బిజీగా వున్న తరుణ్ సినిమా గురించి ఇంకా అధికారిక సమాచారం రావాల్సి వుంది. మరో పక్క నటీనటుల ఎంపిక జరగలేదట. అంతేకాకుండా ఈ సినిమా ఎప్పుడు మొదలవ్వబోతుందో కూడా ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు. కానీ తరుణ్ ఈసారి ఒక స్టార్ హీరోతోనే సినిమాకి సిద్ధమవుతున్నాడని అందుకే రెండో సినిమాని మొదలు పెట్టడానికి ఇంత సమయం తీసుకున్నాడని అంటున్నారు.

Present suspense!:

Finally, Tarun Bhaskar is going to direct his second movie as a comedy entertainer. The film is going to be starring by Bollywood with Aamir Khan's 'Dil Chakha Hai'. Now the suspense says. But Tarun is preparing the movie with a star hero.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs