Advertisement
Google Ads BL

వర్మ అంతరంగాన్ని ఆవిష్కరించింది..!


నిజానికి ప్రతి మనిషిలోనూ ఇగో ఉంటుంది. మానవుడు స్వార్థజీవి. అందులోనూ కళాకారులు ఇంకా ఎక్కువ. వారు సున్నిత మనస్కులు. డబ్బు కాదు.. పది మందిలో గుర్తింపు కోరుకుంటారు. కానీ తమలోని ఆవేదనను, ప్రతిభను సమాజం గుర్తించకపోతే ఒక్కోసారి రాక్షసులుగా మారుతారు. పర్వర్టెడ్‌గా, సైకోలుగా మారినవారు కూడా ఎందరో ఉన్నారు. ఇందుకు చరిత్రలో హిట్లర్‌, చార్లీ చాప్లిన్‌లే ఉదాహరణ. సమాజాన్ని అర్ధం చేసుకోవడం, తననేమనుకున్నా పట్టించుకోని వారు కొందరు ఉండవచ్చు. 

Advertisement
CJ Advs

కానీ అందరూ అలాగే ఉండాలనుకోవడం మాత్రం కరెక్ట్‌ కాదు. ఇక వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌ వర్మ కూడా అలా మారిన వ్యక్తే అనే నిజం కేవలం కొద్ది మంది సన్నిహితులకు మాత్రమే తెలుసు. మొదట్లో ఆయన అందరితో కలివిడి, సరదాగా, మంచి సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉండేవాడు. తన మొదటి చిత్రం 'శివ' షూటింగ్‌ ఓపెనింగ్స్‌ కోసం మీడియా తీసిన ఫొటోలలో ఆయన మొహం కూడా కనిపిస్తుండే సరికి ఆయన చాలా మంది పత్రికల ఎడిటర్లకు స్వయంగా ఫోన్‌ చేసి, ఫొటోలతో తన ఫేస్‌ కనిపించకుండా ఉండేలా చూడమని రిక్వెస్ట్‌ చేసిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. 

అలాంటి నిగర్వి, ఫోటోలకు కూడా ఫోజులివ్వని వ్యక్తి ఈ రోజు వార్తల్లో ఉండటం కోసం వివాదాస్పద ట్వీట్లు, ఇతరులపై సెటైర్లు, తనకు నచ్చినట్లుగా (తనకు ఇష్టమొచ్చినట్లుగా) చిత్రాలు తీస్తున్న ఆయనలో ఖచ్చితంగా ఓ మార్పు వచ్చింది. అందుకే ఆయన తాజాగా తన చిన్ననాటి కూతురితో ఉన్న ఫొటోను ట్వీట్‌ చేసి, ఇది ఇంకా నేను మనిషిగా ఉన్నప్పుడు, నా పూర్వజన్మలోని ఫొటో. ఇది నాలోని రాక్షసుడు లేనప్పటి ఫొటో అని తనపై తానే సెటైర్‌ వేసుకున్నాడు. ఫ్యామిలీ సెంటిమెంట్స్‌కి, ఎమోషన్స్‌కి దూరంగా ఉంటానని, తనకు ఎలాంటి ఎమోషన్స్‌లేవని చెప్పే ఆయన తనపై తాను వేసుకున్న ట్వీట్‌ ఆయనలోని అంతరంగాన్ని మనకి పట్టిస్తుంది. 

Director Ram Gopal Varma Changed:

Raakshasudigaa maaraka mundhu,naa Manavathvam inka bathikunna Manchi roojullo naa koothuritho digina photo Idhi. Varma twited...
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs