Advertisement
Google Ads BL

మామ గ్రీన్ సిగ్నల్ కోసం అల్లుడు వెయిటింగ్..!


తమిళ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు దర్శకుడిగా కూడా ప్రూవ్ చేసుకున్నాడు. దర్శకుడిగా చేసిన మొదటి ప్రయత్నమే అతనికి సక్సెస్ ని తెచ్చిపెట్టింది. రాజ్ కిరణ్ లీడ్ రోల్ లో పవర్ పాండీ ని డైరెక్ట్ చేసిన ధనుష్ మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ చిత్రంలో రాజ్ కిరణ్ వయసైపోయిన ఫైట్ మాస్టర్ గా అద్భుతమైన నటన ప్రదర్శించాడు. అలాగే దర్శకుడిగా కూడా ధనుష్ మంచి మార్కులే కొట్టేసాడు.

Advertisement
CJ Advs

ఇక ఈ హిట్ తో మంచి ఉత్సాహంతో వున్న ధనుష్.. పవర్ పాండీ కి సీక్వెల్ తీస్తానంటున్నాడు. అయితే ఈసారి హీరోగా రాజ్ కిరణ్ ని తప్పించి తన మామ రజినీకాంత్ ని హీరోగా ఈ సీక్వెల్ ని తెరకెక్కించాలనుకుంటున్నాడట ధనుష్. రజనీకాంత్ గనక ఒప్పుకుంటే సీక్వెల్ లో ఆయన్నే డైరక్ట్ చేస్తానని చెబుతున్నాడు ధనుష్.

పవర్ పాండీ మొదటి భాగంలో ఫైట్ మాస్టర్ గా ఇరగదీసిన రాజ్ కిరణ్ ని సీక్వెల్ లో తప్పించి తన మామ రజినీకాంత్ ని తీసుకుంటే తన సినిమాకి ఇంకా పేరొస్తోందని ధనుష్ భావించబట్టే ఇప్పుడు పవర్ పాండీ సీక్వెల్ కి రజిని కోసం కాచుకుని కూర్చున్నాడు. మరి ఎంతైనా రజినీ మార్కెట్ వేరయా..... మరో పక్క తన నిర్మాణ సారధ్యంలో రజినీకాంత్ తో ఒక సినిమాని కూడా నిర్మించబోతున్నాడు ధనుష్.

Dhanush Waiting For Rajinikanth:

Tamil star hero Dhanush is now a Success director.Dhanush is a first time directed movie 'Power Pandy'in this movie hero role to raj kiran. Dhanush .. Power Pandey is going to take a sequel,dhanush is going to play this sequel for his uncle Rajinikanth. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs