Advertisement
Google Ads BL

అమీర్‌, సల్మాన్‌లు అదరగొడుతున్నారు!


లోకనాయకుడు కమల్‌హాసన్‌ తర్వాత ఇక మిస్టర్‌ పర్‌ఫెక్షనిస్ట్‌గా చెప్పుకోవాల్సింది బాలీవుడ్‌ స్టార్‌ అమీర్‌ఖాన్‌ గురించి. సినిమాల కోసం ప్రాణాలు పెట్టేస్తున్నామని చాలామంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. కానీ నిజానికి అలా ప్రాణాలు పణంగా పెట్టేవారిలో అమీర్‌ ముందుంటాడు. ఆయనకు అవార్డులు రాకపోయినా ఆయన లెజెండ్‌. 

Advertisement
CJ Advs

'దంగల్‌' కోసం ఎంతో కష్టపడి కండలు పెంచి, కుస్తీ వీరునిగా మారి, అదే చిత్రంలో మరో గెటప్‌ కోసం భారీగా బరువు పెరిగి, పొట్ట పెంచిన అమీర్‌ ఆ చిత్రం విడుదలైన నాలుగైదు నెలలకే తాజాగా కనిపిస్తున్న లుక్‌ చూసే షాక్‌ అవ్వాల్సిందే. తాజాగా ఆయన 'దూమ్‌3' ఫేమ్‌ విజయ్‌కృష్ణ ఆచార్య దర్శకత్వంలో 'థగ్స్‌ ఆఫ్‌ హిందుస్తాన్‌' చిత్రం చేస్తున్నాడు. ఇది స్వాతంత్య్రానికి పూర్వం జరిగే కథ. బందిపోటు దొంగల నేపథ్యంలో నడుస్తుంది. దీనికోసం అమీర్‌ మరలా సన్నగా, కోరమీసాలతో మేకోవర్‌ అయ్యాడు. వావ్‌.. ఇది అమీర్‌కే సాధ్యమని చెప్పాలి. 

ఇక సల్మాన్‌ కూడా ప్రస్తుతం కబీర్‌ఖాన్‌ దర్శకత్వంలో హ్యాట్రిక్‌ మూవీగా 'ట్యూబ్‌లైట్‌' చేస్తున్నాడు. ఈ చిత్రంలో కాస్త మానసిక ఎదుగుదల లేని పాత్రలో సల్మాన్‌ నటిస్తున్నాడట. చైనా-ఇండో వార్‌ నేపథ్యంలో జరిగే ప్రేమకథ ఇది. ఇక ఇందులో మానసిక ఎదుగుదల లేని వాడిగా నటిస్తున్న సల్మాన్‌ కమల్‌ నటించిన 'స్వాతిముత్యం' చిత్రాన్ని చూసి దానిని గైడెన్స్‌గా తీసుకున్నాడట. మొత్తానికి మన బాలీవుడ్‌ హీరోలు బాగా మారుతున్నారు. ఇక టాలీవుడ్‌ హీరోలలో కూడా ఇప్పుడిప్పుడే మార్పు మొదలైంది. మొత్తానికి మార్పు మంచిదేనని చెప్పాలి. 

Aamir and Salman Creates Sensation in Bollywood:

Aamir Khan surprised us all by his dramatic physical transformation in his last release ‘Dangal’. Now, the actor has begun prepping up for his next project ‘Thugs Of Hindostan’. Kabir Khan's 'Tubelight' will have Salman Khan playing a 'special' role for the first time in his career. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs