Advertisement
Google Ads BL

'బాహుబలి'పై మెగాఫ్యాన్స్‌ సీరియస్‌..!


తమ అభిమాన హీరోలైన చిరంజీవి 'ఖైదీ నెంబర్‌ 150', పవన్‌ కళ్యాణ్‌ల 'కాటమరాయుడు'లకు బెనిఫిట్‌షోలు, ప్రీమియర్‌ షోలు, అర్ధరాత్రి ప్రదర్శనలు, ఎక్కువ షోలకు అనుమతి ఇవ్వని తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు 'బాహుబలి' చిత్రానికి మాత్రం ఆయా సదుపాయాలను కల్పించడం పట్ల మెగాభిమానుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

Advertisement
CJ Advs

కొందరు ఫ్యాన్స్‌ మీరు నిజంగా మెగాభిమానులైతే 'బాహుబలి' చిత్రాన్ని మొదటి 10రోజులు చూడవద్దంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక 'బాహుబలి' షోల సందడి రేపు సాయంత్రం నుంచే మొదలుకానుంది. మరోపక్క ప్రీమియర్‌షోలు, బెనిఫిట్‌షోలకు పెద్దగా పర్మిషన్లు లభించకపోవడంతో ఈ చిత్ర నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పెయిడ్‌ ప్రీమియర్‌షోలుగా వాటి పేరును మార్చి తమ షోలను ప్రదర్శించడానికి రెడీ అవుతున్నారు. 

ఇప్పటికే చిరంజీవి 'ఖైదీ నెంబర్‌ 150'కి పోటీగా వచ్చిన బాలకృష్ణ నటించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి కీలకమైన పన్ను మినహాయింపునిచ్చిన ప్రభుత్వాలు మరోసారి సినిమాలలోకి రాజకీయాలనుజొప్పిస్తూ, తమ హీరోల చిత్రాల పట్ల వివక్షత చూపుతున్నారంటూ మెగాభిమానులు మండిపడుతున్నారు. 

Mega Fans Fire On Baahubali 2:

Mega Fans Hurt with Baahubali 2 Premiere Shows because of their Heroes Movies Premiere Shows Banned the governments of Andhra Pradesh and Telangana. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
CJ Advs