Advertisement
Google Ads BL

మహేష్‌ ఫ్యాన్స్‌కి ఊరటనిచ్చే న్యూస్‌..!


మహేష్‌బాబు, మురుగదాస్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం 'స్పైడర్‌'. తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న ఈ ద్విభాషా చిత్రాన్ని మొదట జూన్‌23న రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. కానీ అది వాయిదా పడింది. కాగా ఈ చిత్రం తాజా షెడ్యూల్‌ పూర్తయిందని, మే నెలాఖరుకు షూటింగ్‌ మొత్తం పూర్తవుతుందని ఈ చిత్రం పీఆర్పో చెబుతున్నాడు. 

Advertisement
CJ Advs

ఇక మే నుంచి మొదలయ్యే పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులకు భారీ సమయాన్నే కేటాయిస్తున్నారు. విఎఫ్‌ఎక్స్‌కు అధిక ప్రాధాన్యం ఉండటంతో దీనికి ఎక్కువ టైం పడుతుందని తెలుస్తోంది. తాజాగా విడుదలైన ఈ చిత్రం స్టిల్స్‌ ఆయన అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ఈ లోకేషన్స్‌ స్టిల్స్‌తోనే మరికొంత కాలం మహేష్‌ అభిమానులు సరిపెట్టుకోవాల్సివుంటుంది. 

ఇక ఈ చిత్రం జులైలో కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మరోపక్క సెప్టెంబర్‌ నుంచి వరుస చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. ఆగష్టు 11 నుంచి లాంగ్‌ వీకెండ్‌ రానుంది. దాంతో 'స్పైడర్‌' చిత్రాన్ని ఆగష్టు9న విడుదల చేసే అవకాశాలున్నాయంటున్నారు. అదే నిజమైనే సూపర్‌స్టార్‌ అభిమానులకు ఇది శుభవార్తే కానుంది. ఆ తేదీకి ఉన్న ప్రత్యేకత అందరికీ తెలిసిందే. 

Mahesh Babu's Spyder Release On August 9:

'Spyder's release date has been locked to August 9 which falls on the birthday of Mahesh. If at all the production team sticks to their decision, it's going to be a double treat for fans on August 9. Rakul Preet Singh has played romantic interest of Mahesh while Harris Jairaj provided music. South top director AR Murugadoss has directed the movie. NV Prasad and Tagore Madhu are producing the movie.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs