Advertisement
Google Ads BL

'అంధగాడు' రాజ్ తరుణ్..!


కుర్ర హీరోలందరిలో హిట్ బాటలో పరిగెడుతున్న రాజ్ తరుణ్ ఎక్కడా తగ్గడంలేదు. అదే జోరు కంటిన్యూ చేస్తూ దూసుకుపోతున్నాడు. 'ఉయ్యాలా జంపాల'తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాజ్ తరుణ్ తాజాగా 'కిట్టు ఉన్నాడు జాగ్రత్త' చిత్రంతో హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు 'అంధగాడు' చిత్రంతో మరోమారు ప్రేక్షకులను కనువిందు చెయ్యడానికి సిద్ధమైపోతున్నాడు. 'అంధగాడు' టీజర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

Advertisement
CJ Advs

రాజ్ తరుణ్ గుడ్డివానిగా నటిస్తున్న 'అంధగాడు' చిత్రాన్ని వెలిగొండ శ్రీనివాస్ డైరెక్ట్ చేస్తుండగా.... హెబ్బా పటేల్ మరోమారు రాజ్ తరుణ్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ జోడి ఇప్పటికే హిట్ ఫెయిర్ గా పేరు తెచ్చుకుంది. మరి గుడ్డివాని కేరెక్టర్ లో రాజ్ తరుణ్ బాగానే నటించాడనే విషయం టీజర్ చూస్తుంటే తెలుస్తుంది. ఇక రాజ్ తరుణ్ చెప్పిన డైలాగ్.. 'కళ్లు లేనప్పుడు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూశా.... కానీ ఇప్పుడు ఎప్పుడు పోతాయ్ అని వెయిట్ చేస్తున్నా'... అనే డైలాగ్ తోపాటు 'అంధగాడు' లో కనిపిస్తున్న యాక్షన్ ప్లస్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ చూస్తుంటే ఈ చిత్రంతో రాజ్ తరుణ్ మళ్లీ హిట్ కొట్టే ఛాన్సెస్ ఎక్కువగానే కనిపిస్తున్నాయి.

Raj Tarun in Andagadu Movie:

Young Hero Raj Tarun, who is known for romantic entertainers, was mostly seen as a reckless youth in most of his movies. But, Raj Tarun will be seen as a visually challenged guy in his upcoming movie 'Andagadu' directed by Veligonda Srinivas. Hebah Patel will be sharing the screen space with Raj Tarun for the second time after 'Kumari 21F'
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs