చిత్ర పరిశ్రమకు అపారమైన సేవలు అందించి, నిర్మాతలుగా, స్టూడియో అధినేతలుగా ఉన్నవారిని, పరిశ్రమ విస్తీర్ణతది దోహదం చేసినవారిని దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికచేయడం ఆనవాయితీ. కానీ ఈ సారి దర్శకుడు కె.విశ్వనాథ్‌కు ఫాల్కే దక్కడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. తన సుదీర్ఘ కెరీర్‌లో విశ్వనాథ్ కేవలం దర్శకుడిగానే ఉన్నారు. నిర్మాతగా సేవలు అందించింది లేదు. ఆయన తన కెరీర్‌ను కొనసాగించారు. అయినప్పటికీ ప్రతిష్టాత్మక పురస్కారానికి ఆయన పేరును ప్రకటించడం వెనుక కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఉన్నారనే మాట వినిపిస్తోంది. మొదటి నుండి కేంద్ర, రాష్ట్ర అవార్డులు కె.విశ్వనాథ్‌ను వరించాయి. ఆయన సినిమా అనగానే అవార్డు గ్యారెంటీ అనే ప్రచారం జరిగేది.
ఇప్పుడు ఫాల్కే దక్కడం ఆ వెంటనే చిరంజీవి, పవన్‌కల్యాణ్ వెళ్లి అభినందించడం చూస్తుంటే తెరవెనుక మతలబు జరిగినట్టు స్పష్టమవుతోంది. నిజానికి ఫాల్కే అవార్డుకు అర్హులైన వారిలో అక్కినేని నాగేశ్వరరావు తర్వాత దాసరి నారాయణరావు, సూపర్‌స్టార్ కృష్ణ, డా.డి.రామానాయుడు వంటి వారున్నారు. వీరిలో రామానాయుడుకు ఆల్‌రెడీ ఇచ్చేశారు. ఇక మిగిలింది దాసరి, కృష్ణ. వీరిద్దరు చిత్ర పరిశ్రమకు నటులుగా, నిర్మాతలుగా సేవలు అందించారు. ఇద్దరికీ అత్యధిక చిత్రాల క్రెడిట్ ఉంది. నాలుగేళ్ళ క్రితమే దాసరి నారాయణరావుకు ఫాల్కే పురస్కారం లభిస్తుందని ప్రచారం జరిగినా, చివర్లో ఒక సీనియర్ నటుడి వల్ల ఆగింది. ఇక తెలుగువారికి ఫాల్కే రాదేమో అని సంశయంలో ఉండగా, అనూహ్యంగా కె.విశ్వనాథ్ పేరును ప్రకటించారు. దాసరి కాంగ్రెస్ పార్టీలో ఉండడం కారణం కావచ్చు. దాసరికి పద్మశ్రీ పురస్కారం కూడా లభించలేదు. సూపర్‌స్టార్ కృష్ణకు మొదటి నుండి అన్యాయమే జరుగుతోంది. పురస్కారాల విషయంలో లాబీయింగ్ జరుగుతుందనే దానికి ఇది తాజా ఉదాహారణ.