కళాతపస్వి కె. విశ్వనాథ్ కు దాదా సాహెబ్ పాల్కె అవార్డు కేంద్రం ప్రకటించిన తర్వాత ఆయనకు టాలీవుడ్ హీరోలు అభినందనలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా ను వేదిక గా చేసుకుని కొందరు శుభాకాంక్షలు తెలుపుతుంటే... మరికొందరు ఫోన్ లో అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక మెగా హీరో చిరంజీవి అయితే కె. విశ్వనాథ్ ఇంటికి వెళ్లి మరీ పుష్ప గుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేసారు. మరి అంతటి గొప్ప అనుబంధం విశ్వనాద్ ది చిరంజీవిది. ఆపద్బాంధవుడు, స్వయంకృషి వంటి గొప్ప చిత్రాలు చిరంజీవికి అందించిన ఘనుడు డైరెక్టర్ విశ్వనాథ్.
అదలా ఉంటే ఈ రోజు బుధవారం ఉదయం చిరు తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అతని స్నేహితుడు త్రివిక్రమ్ తో కలిసి కె. విశ్వనాథ్ ఇంటికి వెళ్లి శాలువాతో సగౌరవంగా సత్కరించి... పుష్ప గుచ్చం స్వీట్ ప్యాకెట్ తో దాదా సాహెబ్ పాల్కే అవార్డు వచ్చినందుకు గాను శుభాకాంక్షలు తెలిపి విశ్వనాథ్ దంపతుల దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే విశ్వనాథ్ కుటుంబంతో కలిసి కాసేపు గడిపారు. ఇంకా విశ్వనాథ్ గారితో కాసేపు ముచ్చటించి మరీ వచ్చారు. మరి ఎవరు విశ్వనాథ్ ని పరామర్శించి శుభాకాంక్షలు తెలిపినప్పటికీ... నిన్న చిరు... నేడు పవన్ ఇలా విశ్వనాథ్ గారిని అభినందించడం మాత్రం విశేషంగా కనబడుతుంది.
Click Here to see the Pawan Kalyan and Trivikram Meets K Vishwanath Photos