Advertisement
Google Ads BL

బాహుబలి కోసం షూటింగ్ కి సెలవిచ్చారంట!


దేశం మొత్తం 'బాహుబలి' మ్యానియాతో కొట్టుకుంటుంది. 'బాహుబలి ద కంక్లూజన్' చిత్రం ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుండడంతో ప్రేక్షకులంతా మొదటి రోజే 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో...' తెలుసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. అందుకే ఆఫీస్ లకు సెలవు పెట్టేసి మరీ సినిమాకి చెక్కేయ్యాడని టికెట్స్ కొనేసుకుంటున్నారు. మరో పక్క గవర్నమెంట్ ఉద్యోగులు కూడా 'బాహుబలి' సినిమా చూడాలనే కోరికతో పై అధికారులకి సెలవు కావాలని విజ్ఞప్తి చేసుకుంటున్నారు. అంతలా బాహుబలి ఫీవర్ వచ్చేసింది జనాలకు.

Advertisement
CJ Advs

ఇక ఇదంతా ఒక ఎత్తైతే మరోపక్క సినిమా ఇండస్ట్రీలో కూడా 'బాహుబలి' అభిమానులు చాలామందే ఉన్నారు. అందుకే తమ తమ షూటింగ్స్ ని వాయిదా వేసుకుని మరీ బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపుతాడో అనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవడం కోసం వచ్చేస్తున్నారు. ఇలా చేసింది మరెవరో కాదు మంచు మనోజ్ తాజా చిత్ర దర్శకుడు అజయ్ నూతక్కి. మంచు మనోజ్ 'ఒక్కడుమిగిలాడు' చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుండగా ఇప్పుడు బాహుబలి చిత్రంలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే దాని కోసం ఏకంగా షూటింగ్ కి సెలివిచ్చేసాడు అజయ్ నూతక్కి. సినిమా యూనిట్ మొత్తం కలిసి బాహుబలి కోసం చెక్కేస్తున్నాం అందుకే షూటింగ్ కి కొద్దిగా విరామ ఇచ్చేశాం అంటూ మనోజ్ ట్వీట్ చేసాడు. చూసారా 'బాహుబలి' చిత్రానికి ఉన్న క్రేజ్. 

Shooting Postponed For Baahubali 2 movie:

'Baahubali the Conclusion' is coming to the audience this Friday the audience is the first day. 'kattappa' why did not kill the baahubali. Manoj tweeted that the film unit is engraved for Bahubali and hence gave a little break to the shooting
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs