Advertisement
Google Ads BL

పవన్ పరుగులు పెట్టిస్తున్నాడు..!


ఒక పక్కన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు 2019  కంటే ముందే వచ్చినా  ఆ ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి  జనసేన సిద్ధంగా ఉందని ప్రకటించాడు పవన్ కళ్యాణ్. మరో వైపు సినిమా షూటింగ్ లోను జోరు చూపిస్తున్నాడు. మరి 2019  ఎన్నికలకు సిద్ధమవడానికి పవన్ ఒప్పుకున్న సినిమాలను ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా పూర్తి చెయ్యాలని కంకణం కట్టుకున్నాడు. అందుకే చేస్తున్న సినిమాలను త్వరితగతిన పూర్తి చేసి 2019 ఎన్నికలకు సిద్ధమవుతున్నాడు. ఇప్పుడు ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో పవన్ నటిస్తున్న చిత్రం శరవేగంగా మొదటి షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. మొదటి షెడ్యూల్ లోనే పవన్, హీరోయిన్ అను ఇమ్మాన్యువల్, సీనియర్ నటి ఖుష్బూ ల పై కీలక సన్నివేశాలను తెరకెక్కించాడు డైరెక్టర్ త్రివిక్రమ్.

Advertisement
CJ Advs

అలాగే  మరో హీరోయిన్ కీర్తి సురేష్ కూడా త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబోలో తెరకెక్కే షూటింగ్ లో పాల్గొంటుంది. ఇక ఈ చిత్రానికి సంబందించిన రెండో షెడ్యూల్ కూడా  మంగళవారం హైదరాబాద్ లో మొదలైంది. ఇక ఈ రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా హైదరాబాద్ లో వచ్చే నెల మూడు వరకు జరగనుంది. పవన్ కళ్యాణ్ సాఫ్ట్ వెర్ ఇంజనీరుగా చేస్తున్న ఈ చిత్రం కామెడీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని సమాచారం.

Pawan and Trivikram Film Shooting Update:

After Katamarayudu, Powerstar Pawan Kalyan hasn't took much break and joined the sets of Trivikram Srinivas film. Shooting kickstarted recently and already first schedule has been wrapped.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs