Advertisement
Google Ads BL

బాక్సాఫీస్ దున్నేసేందుకు బాహుబలి రెడీ!


బాహుబలి ద కంక్లూజన్.... గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రధానంగా వినబడుతున్న సినిమా పేరు. ఈ సినిమా ఈ శుక్రవారమే విడుదలకు సిద్దమయ్యింది. ఇప్పటికే యు/ ఏ సర్టిఫికెట్ తో బరిలోకి దిగుతున్న బాహుబలి బాక్సాఫీస్ ని దున్నేయ్యడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు తియ్యగల రాజమౌళి ఎంతో కష్టపడి శ్రమటోడ్చి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నాలుగు భాషల్లో విడుదల చెయ్యనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులన్నీ తిరగరాయడానికి ఉవ్విళ్లూరుతోంది.

Advertisement
CJ Advs

ఇప్పటికే ఏపీ లో రోజుకు ఆరు షోలు ప్రదర్శించడానికి ఏపీ ప్రభుత్వం అనుమతినివ్వగా... తెలంగాణ ప్రభుత్వం ఐదు షోలకు అనుమతినిచ్చింది. అందులోనూ 9000  థియేటర్స్ లో ప్రపంచ వ్యాప్తం గా విడుదలవుతున్న బాహుబలి చిత్రం బాలీవుడ్ రికార్డ్స్ ని తుడిచి పెట్టడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదు. మరి ఒక తెలుగు డైరెక్టర్ ఈ రేంజ్ లో సినిమాని తెరకెక్కించడమంటే అది ప్రతి ఒక్క తెలుగువాడు గర్వించదగిన విషయమే. 

ఇక ఈ చిత్రంలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్ ప్రధాన పాత్రలు పోషించారు.

Baahubali 2 Release in 9000 Theaters:

Baahubali: The Conclusion is all set to hit the theaters this week. Baahubali 2 is releasing in as big as 9000 screens worldwide
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs