Advertisement
Google Ads BL

కృష్ణ వంశీ చిత్రం విడుదలకు సిద్ధం..!


డైరెక్టర్ కృష్ణ వంశీ వరుస పరాజయాలతో కొట్టు మిట్టాడుతున్నాడు. ఆయన తాజా చిత్రం నక్షత్రం కూడా మొదలు పెట్టి చాలా కాలమే అయ్యింది. కానీ ఇప్పటి వారికి ఆ చిత్రానికి సంబందించిన అప్ డేట్ ఎక్కడా కనబడలేదు. ఈ చిత్రంలో నటిస్తున్న సందీప్ కిషన్, రెజినాలు కూడా ఈ చిత్రంపై ఎక్కడా నోరు విప్పడం లేదు. నక్షత్రం సినిమాకి హైప్ క్రియేట్ చెయ్యడానికి మరో యువ హీరో హీరోయిన్ ల హెల్ప్ తీసుకున్నాడు కృష్ణ వంశి. సాయి ధరమ్ తేజ్, ప్రగ్య జైస్వాల్ లు గెస్ట్ పాత్రలు చేస్తే అయినా ఈ సినిమాకు కొంత ప్లస్ అవుతుందనుకున్నాడు. వారు కూడా కృష్ణ వంశి ని ఆదుకోలేకపోయారు.

Advertisement
CJ Advs

ప్రస్తుతం ఒక్క పాట మినహా చిత్ర షూటింగ్ మొత్తం పూర్తయినట్టు తెలుస్తోంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా వేగంగానే జరుగుతుండటంతో  ఎట్టకేలకు నక్షత్రం చిత్రం ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతుందని అంటున్నారు. బాహుబలి ఈ 28  న బాక్స్ఆఫీస్ బరిలోకి  వస్తుండడంతో తర్వాతి నెల మేలో చిన్న చిత్రాలు సందడికి ముహుర్తాలు ఫిక్స్ చేసుకున్నాయి. బాబు బాగా బిజీ, అందగాడు, కేశవ చిత్రాలతో పాటే కృష్ణ వంశీ కూడా మేలోనే నక్షత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. 

Krishna Vamsi - Nakshatram Movie Release Coming Up:

The most awaited Krishna Vamsi film Nakshatram is going to release in May. Along with Sundeep Kishan, there are Regina, Sai Dharam Tej, Pragya Jaiswal, Prakash Raj and others in key leads. Let’s see how far their attempts to fold Nakshatram in May will succeed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs