Advertisement
Google Ads BL

చిరు 151 గురించి రామ్ చరణ్..!


చిరంజీవి సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తానని చెప్పి చాలా కాలం ఊరించాక 'ఖైదీ నెంబర్ 150' తో ప్రేక్షకుల ముందుకు వచ్చి హిట్ కొట్టాడు. ఇక ఇప్పుడు కూడా ఖైదీ... వచ్చి మూడు నాలుగు నెలలు గడుస్తున్నా తన తదుపరి ప్రాజెక్ట్ 151 వ చిత్రాన్ని మొదలు పెట్టడానికి చాలా ఆలోచిస్తున్నాడు చిరు. అయితే ఇప్పుడు తీసే చిత్రం స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కనున్న చిత్రం కావడంతో ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పర్ఫెక్ట్ గా వుండాలని... డైరెక్టర్ సురేందర్ రెడ్డికి చిరు చెప్పడంతోనే ఈ సినిమా ఆలస్యం అవుతుందని ప్రచారం జరిగింది.

Advertisement
CJ Advs

ఈ చిత్ర నిర్మాత రామ్ చరణ్ సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్ర షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతుండడంతో అక్కడ మెగా ఫ్యాన్స్ చరణ్ ని కలిసి...  చిరంజీవి 151 వ చిత్రం గురించి అడిగారట. ఆగష్టు నుండి నాన్నగారి సినిమా మొదలు పెడుతున్నామని రామ్ చరణ్ మెగా అభిమానులకి తెలిపినట్లుగా సమాచారం. మరి నిజంగా చిరు ఉయ్యాలవాడ... చిత్రం ఆగష్టు లో గనక మొదలైతే అది చిరంజీవి బర్త్ డే రోజు అంటే ఆగష్టు  22  నుండి ఈ చిత్రం సెట్స్ మీదకెళుతుందన్నమాట. పూర్తి వివరాలు అతి త్వరలో తెలిసే అవకాశాలు వున్నాయి. 

Ram Charan about Chiranjeevi's 151 Film:

Mega Power Star Ram Charan's untitled film under Sukumar's direction witnesses huge rush of mega fans everyday at the shooting spot which is being held at Kolleru of West Godavari district. Ram Charan convened meeting with mega fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs