Advertisement
Google Ads BL

రామ్ చరణ్ కోసం మళ్లీ అల్లు అర్జున్..!


ఆ మధ్యన రామ్ చరణ్ - అల్లు అర్జున్ లు మల్టి స్టారర్ లో నటించబోతున్నారనే వార్త సెన్సేషన్ అయ్యింది. అయితే అన్నారు కానీ ఇప్పటి వరకు ఆ చిత్రం గురించి మళ్ళీ ఎక్కడా వినిపించడం లేదు. కాకపోతే వీరిద్దరూ ఇప్పటికే ఒక మల్టీ స్టారర్ చిత్రంలో నటించారు. 'ఎవడు' చిత్రంలో రామ్ చరణ్ ఫుల్ లెన్త్ రోల్ చెయ్యగా అల్లు అర్జున్ కొద్ది నిముషాలు సందడి చేసాడు. ఎక్కడా స్క్రీన్ మీద వీరిద్దరూ ఒకేసారి కనబడలేదు ఆ చిత్రంలో. అయితే ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఒక చిత్రం చెయ్యబోతున్నారట. ఇద్దరూ కలిసి నటించరట కానీ.... ఆ చిత్రంలో ఇద్దరికీ ఒక సంబంధం వుంటుందట.

Advertisement
CJ Advs

అల్లు అరవింద్ కన్నడలో హిట్ అయిన 'బహద్దూర్' చిత్రాన్ని తెలుగులో  రీమేక్ చేయాలనుకుంటున్నారట. అయితే ఆ చిత్రం పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉంటుంది కాబట్టి ఈ చిత్రాన్ని చరణ్ తో రీమేక్ చెయ్యాలని భావిస్తున్నాడట అరవింద్. ఇక ఇందులో చరణ్ హీరోగా నటిస్తే బన్నీ వాయిస్ ఓవర్ అందిస్తాడని ఫిలింసర్కిల్స్ లో టాక్ వినబడుతుంది. అయితే కన్నడలో తెరకెక్కిన 'బహద్ధూర్' చిత్రానికి కన్నడ సూపర్ స్టార్  పునీత్ రాజ్ కుమార్ వాయిస్ అందించాడు. ఇక ఆ సినిమాకి వాయిస్ ఓవర్ చాలా హెల్ప్ అయినందున ఇపుడు తెలుగులో అల్లు అర్జున్ తో వాయిస్ ఓవర్ చెప్పిస్తే సినిమా సూపర్ హిట్ అవుతుందని అల్లు అరవింద్ నమ్మడం వలెనే ఇలా ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు.

Allu Arjun Voice over For Ram Charan Movie:

Allu Arjun will be giving voice to his friend and cousin Ram Charan's film.  Allu Arvind is planning to produce the Kannada superhit 'Bahaddur' with Ram Charan in Telugu. Allu Arjun for the voice over for it.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs