నాని వరుస సినిమాలను లైన్ లో పెడుతూ తెగ బిజీగా మారిపోయాడు. అందివచ్చిన అవకాశాన్ని వదలకుండా వడిసిపట్టుకుంటూ స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇచ్చే రేంజ్ కి ఎదిగిపోయాడు నాని. ఇప్పుడు తాజాగా నాని నటిస్తున్న 'నిన్నుకోరి' చిత్రం పూర్తి కావొచ్చింది. ఇక ఈ చిత్రం విడుదల కాగానే నాని, డైరెక్టర్ వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో... దిల్ రాజు నిర్మాతగా ఒక కొత్త చిత్రాన్ని ప్రారంభించడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ చిత్రంలో నాని కి జోడిగా హీరోయిన్ సెట్ అయినట్లు వార్తలొస్తున్నాయి.
మలయాళంలో 'ప్రేమమ్' చిత్రంతో తిరుగులేని స్టార్ డమ్ సంపాదించుకున్న సాయి పల్లవిని నాని కొత్త చిత్రానికి హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. ఇప్పటికే సాయి పల్లవి తెలుగులో వరుణ్ తేజ్ కి జోడిగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో 'ఫిదా' చిత్రంలో నటిస్తోంది. అలాగే తమిళ రీమేక్ 'చార్లీ’ లో కూడా నటిస్తోంది. అయితే 'చార్లీ’ సినిమా షూటింగ్ వాయిదా పడడంతో సాయి పల్లవి నాని చిత్రానికి డేట్స్ అడ్జెస్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. మరి దిల్ రాజు నిర్మాత అంటే ఈ చిత్రం పూర్తి కుటుంబ కథా చిత్రంగా... రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఉండబోతున్నట్లు ఇంకా ఈ చిత్రంలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ భూమిక కూడా నటిస్తుందనేది తెలిసిన విషయమే.