జనసేనాని పవన్‌కళ్యాణ్ దూకుడు పెంచాడు. ఇటీవల ఆయన దక్షిణాదిపై ఉత్తరాది పెత్తనంపై స్వరం వినిపిస్తున్నాడు. భిన్నత్వంలో ఏకత్వంకే ఇది ప్రశ్నార్ధకమని చెబుతున్నాడు. ఈ భావాలతో చాలా మంది ఏకీభవిస్తున్నప్పటికీ దేశ ఐక్యత దృష్ట్యా మౌనం పాటిస్తున్నారు. ఇక తాజాగా పవన్ తన ట్విట్టర్ అకూంట్‌లో పలు పత్రికల్లో వచ్చిన ఉత్తరాదిపై దక్షిణాది వివక్షను గురించి ఆర్టికల్స్ క్లింపింగ్స్‌ను పోస్ట్ చేశాడు. దీంతో ఆయన వైఖరి బాగా స్పష్టమైపోతోంది.
అయితే గతంలో మన దక్షిణాది నుంచి ఇద్దరు ప్రధానులుగా పనిచేశారు. పి.వి. నరసింహారావు, దేవగౌడలు ఉన్నప్పుడు దక్షిణాదికి వారు చేసింది ఏమిటి? కేంద్రంలో ఎవరున్నా... ఎక్కువగా ఉత్తరాది ఆదిపత్యం సాధిస్తే చాలు అధికారంలోకి వచ్చేస్తామనే భావనకు వచ్చారు. ముఖ్యంగా బిజెపి అయితే దక్షిణాదిపై పట్టుకు ప్రయత్నిస్తున్నా కూడా.. ఉత్తరాదిలో ఊపు ఊపితే అధికారంలోకి వస్తామని భావిస్తోంది. కానీ వెంకయ్య వంటి వారు మాత్రం దక్షిణాదిపై చిన్నచూపు లేదంటున్నారు. మరోపక్క పవన్ వాదనకు రోజు రోజుకు బలం పెరుగుతోంది. హీరో శివాజీ, చలసాని శ్రీనివాస్‌లతో పాటు తాజాగా ఒకప్పటి స్టార్ సుమన్ కూడా గొంతు కలిపాడు.
ఉత్తరాదివారు ప్రధానులుగా ఉన్నప్పుడు ఉపప్రధాని పదవిని దక్షిణాదికి ఇవ్వాలనే వాదన తెచ్చాడు. కానీ ఇది వృథానే అని చెప్పవచ్చు. ఉప ప్రధాని పదవి ఆరోవేళులాంటిది. గతంలో సమైఖ్య ఆంధ్రప్రదేశ్‌లో కూడా సీఎం కోస్తా, రాయలసీమ వారుంటే ఉప ముఖ్యమంత్రి పదవి తెలంగాణ వారికి ఇవ్వాలన్నారు. కానీ దాని వల్ల కలిగిన ప్రయోజనం ఏమైనా ఉందా? తెలంగాణ ప్రజల భావాలను ఎవరైనా మార్చగలిగారా? కాబట్టి ప్రత్యామ్నాయం అది కాదు. దక్షిణాది రాష్ట్రాలు కూడా తమ సమైక్యతను చాటుకుని, మన ఎంపీల బలంతో దేశాన్ని తనవైపుకు దృష్టి పడేలా చేయగలగాలి..!