Advertisement
Google Ads BL

'స్పైడర్' రిలీజ్ ఎప్పుడో తెలుసా..?


మహేష్ - మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'స్పైడర్' చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్రం ఫస్ట్ లుక్ కి మంచి స్పందన వచ్చి అంచనాలు రెట్టింపైయ్యాయి. ఈ 'స్పైడర్' చిత్రం అటు తమిళం ఇటు తెలుగులో ఏకకాలంలో తెరకెక్కుతుంది. అయితే ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఇదిగో అదిగో అంటూ ఊరిస్తూ ఈ మధ్యనే సైలెంట్ గా విడుదల చేశారు. ఇక ఇప్పుడు 'స్పైడర్' చిత్రాన్ని జూన్ 23 న రిలీజ్ చేస్తామని చెప్పిన మేకర్స్... విజువల్ వర్క్ పూర్తి కానందున పోస్ట్ పోన్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
CJ Advs

అయితే మహేష్ తన చిత్రాన్ని జూన్ 23  నుండి పోస్ట్ పోన్ చేసాడో లేదో 'డీజే' బన్నీ తన చిత్రాన్ని జూన్ 23 న బరిలోకి దింపుతున్నాడు. అల్లు అర్జున్ 'దువ్వాడ జగన్నాథం' చిత్రాన్ని జూన్ 23 న విడుదల చేస్తున్నట్లు ఆఫీషియల్ అనౌన్సమెంట్ చేశారు. ఇక మహేష్ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందో అర్ధం కాక మహేష్ ఫ్యాన్స్ మరోసారి వెయిటింగ్ లిస్ట్ లోకి వెళ్లిపోయారు.

అయితే ఇప్పుడు మహేష్ - మురుగదాస్ చిత్రానికి ఆగష్టు 25 విడుదల డేట్ లాక్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. మరి మురుగదాస్ 'స్పైడర్' కి సంబందించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ త్వరగా పూర్తి చేసి ఆగష్టు 25 నాటికి చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నద్ధం అవుతున్నాడట. 'స్పైడర్' చిత్రంలో మహేష్ ఇంటిలిజెన్స్ ఆఫీసర్ గా నటిస్తుండగా రకుల్ డాక్టర్ గా నటిస్తుంది. ఇక తమిళ హీరో భరత్ ఒక ముఖ్యమైన పాత్రలో చేస్తున్నాడు.

Spyder Postponed to August:

Prince Mahesh Babu is busy with his upcoming movie titled ‘Spyder’. Earlier the movie makers announced that the movie will be released on June 23rd but now the movie has been postponed tentatively. The latest buzz is that now the movie has been pushed to August.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs