పోరాడితే పోయేదేముంది.. బానిస సంకెళ్లు తప్ప అని చెప్పిన మహాకవి మాటలను తమిళనాడు రైతులు నిజం చేస్తున్నారు. యూపీ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని రైతులకు రుణమాఫీ చేస్తానని చెప్పిన మోదీ... దక్షిణాదిరాష్ట్రాల విషయంలో మాత్రం వివక్ష చూపుతున్నాడనే విమర్శలను ఎదుర్కొంటున్నాడు. ఇక తమ రుణమాఫీ, సవరించిన కరవు ప్యాకేజీ, మద్దతు ధర వంటి విషయాలలో తమిళనాడు రైతులు స్ఫూర్తి వంతంగా పోరాడుతున్నారు. జల్లికట్టుతో తామేంటో చూపిన వారు కేంద్రం మెడలు వంచేందుకు గత 40రోజులుగా ఏకంగా ఢిల్లీలో ఉద్యమం చేస్తున్నారు. గుండు గీయించుకోవడం, మీసాలు తీసుకోవడం, పిండ ప్రదానాలు చేయడం, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల పుర్రెలను ప్రదర్శించడంతో పాటు పలు వినూత్న ప్రజాస్వామ్య నిరసన విదానాలు చూపిస్తున్నారు.
తాజా తమకు సాగు, తాగునీరు ఇవ్వనప్పుడు తమ మూత్రమే తాము తాగుతామని చెప్పి, పోలీసులు వారించినా, మూత్రం తాగారు. ఖచ్చితంగా తమిళనాడుతో పాటు అక్కడి రాజకీయపార్టీలు, అందరూ దీనికి మద్దతు తెలిపి, మోదీ తలలు వంచడం ఖాయం. కానీ మన రాష్ట్రంలో కులాలు, ప్రాంతాలు, విభజించి పాలించు తరహాలో మన నాయకులు, పార్టీలు ఇలా చేయలేవు. కేంద్రం ముందు నిరసన తెలపాల్సిన వారు తమ ఊళ్లలో మాత్రమే నిరసన తెలుపుతారు. అది ప్రత్యేకహోదా ఉద్యమమైనా, రైతుల కష్టాలైనా.. అంతే.. ఇక మన సీఎంలకు, మంత్రులకు కూడా పోరాడే ఉద్దేశ్యం లేదు. వీలుంటే పోరాడే వారిని చులకన చేయడం, వాటి తీవ్రతను తగ్గించడం తప్ప..! మనది నిజంగా ఆరంభశూరత్వమే.