Advertisement
Google Ads BL

‘టచ్ చేసి చూడు’ ఈ భామకి కలిసొస్తుందో..?


'కంచె' చిత్రంతో ప్రేక్షకుల మన్ననలు పొందిన ప్రగ్య జైస్వాల్ ఆ చిత్రంలో చాలా ట్రెడిషనల్ అమ్మాయిగా నటించింది. ఆ చిత్రంలో ప్రగ్యాకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన 'నమో వెంకటేశాయ , గుంటూరోడు' చిత్రంలో అందాల ఆరబోతతో రెచ్చిపోయింది. అయినా ప్రగ్యాకు ఆ రెండు చిత్రాలు నిరాశే మిగిల్చాయి. ప్రగ్య గ్లామర్ ఆ చిత్రాలను ఏమాత్రం ఆదుకోలేకపోయాయి. ఇక ప్రగ్యాకు టాలీవుడ్ లో స్టార్ హీరోల పక్కన పెద్దగా అవకాశాలు రావడంలేదు. అయినా ఏ మాత్రం నిరాశపడకుండా అవార్డ్స్ ఫంక్షన్స్ లో తన టేలెంట్ చూపిస్తూనే ఉంది. 

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు కృష్ణ వంశీ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న 'నక్షత్రం' చిత్రంలో ప్రగ్య ఒక గెస్ట్ రోల్ లో కనబడనుంది. కాకపోతే ఈసినిమా మొదలుపెట్టి చాలా రోజులే అయ్యింది. కానీ విడుదల ఎప్పుడవుతుందో మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఈ చిత్రం సందీప్ కిషన్ హీరోగా రెజినా హీరోయిన్ గా సాయి ధర్మ తేజ్ ముఖ్య పాత్రలో తెరకెక్కుతుంది. అయితే ప్రస్తుతానికి ఖాళీగా వున్న ప్రగ్యాను రవితేజా హీరోగా చేస్తున్న ‘టచ్ చేసి చూడు’ లో డైరెక్టర్  విక్రమ్ సిరికొండ హీరోయిన్ గా సెలెక్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. 

అయితే ఈ విక్రమ్ సిరికొండ ‘టచ్ చేసి చూడు’ చిత్రంలో ఇప్పటికే రాశి ఖన్నాని మెయిన్ హీరోయిన్ గా తీసుకున్న విషయం తెలిసిందే. మరి ఇప్పుడు ప్రగ్య జైస్వాల్ ‘టచ్ చేసి చూడు’ లో రెండో హీరోయిన్ అన్నమాట. మరి చేతిలో అవకాశాలు లేనప్పుడు ఏ హీరోయిన్ అయితే ఏమిటి... అని అంటున్నారు. మరి ప్రగ్యాను ‘టచ్ చేసి చూడు’ చిత్రమైనా బ్రేక్ ఇస్తుందేమో చూద్దాం.

'Touch Chesi Chudu' Movie is what happens to me..?:

Pragya Jaiswal has acted as a very traditional girl in the Kancha film. The next 'Namo Venkateshaya, Gunturudu' films not success to pragya jaiswal. Pragya Jaiswal is now the second heroine of 'Touch Chesi Chudu' film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs