Advertisement
Google Ads BL

బాగా కష్టపడాలంటున్న నటుడు..!


ఈ మధ్యన మీడియాలో, ఇండియాలోని ఆల్ ఫిలిం ఇండస్ట్రీస్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న మహాభారత గురించే చర్చించుకుంటున్నారు. సుమారు వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ మహా భారత మూవీలో పలువురు సూపర్ స్టార్స్ నటించనున్నారని ప్రచారం జరుగుతుంది. వాసుదేవన్ నాయర్ రచించిన ‘రాందామూజం’ నవల ఆధారంగా శ్రీ కుమార్ మీనన్ ఈ మహాభారతన్నీ తెరకెక్కిస్తున్నాడు. అయితే తెలుగు, తమిళం, కన్నడ, ఆగ్లం, హిందీ, మలయాళం భాషలలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆయా భాషల సూపర్ స్టార్స్ చాలా మంది ఈ చిత్రంలో నటిస్తారని.... ఇప్పటికే మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మహాభారత లో భీముని పాత్రకి ఎంపికయ్యాడని అంటున్నారు.

Advertisement
CJ Advs

అయితే ఈ భీముని పాత్ర కోసం మోహన్ లాల్ కొంతమంది గురువుల వద్ద తాను సుమారు రెండేళ్ళు శిక్షణ పొందుతానని చెబుతున్నాడు. అసలు ఇప్పటివరకు మహాభారత లోని భీముడు బాగా కండలు పెంచి బొద్దుగా కనబడతాడు. అందుకే భీముని పాత్రకు మోహన్ లాల్ ని ఎంపిక చేశారా? అనే డౌట్ వచ్చేసింది జనాలకు. కానీ ఈ నవల కథనం ప్రకారం భీముడు భావోద్వేగాలున్న వ్యక్తి అని అందరూ గుర్తిస్తారని చెబుతున్నారు. వాసుదేవన్ ఈ చిత్రానికి స్వయంగా స్క్రీన్ ప్లే రాశారని అంటున్నారు. ఇక వచ్చే ఏడాది సెట్స్ మీదకెళ్లనున్న మహాభారత చిత్రాన్ని 2020  లో విడుదల డేట్ ప్రకటించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట.

Mohanlal is working very hard for Mahabharata Movie:

Mahabharata this is a big budget movie with a big Indian film. Mohanlal, the Malayalam superstar, was chosen for Bhima in Mahabharata. Mohanlal says that he is trained for some two years at some gurus for the role of Bhima
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs