నేటితరం యంగ్‌హీరోయిన్లలో మంచి డ్యాన్సర్‌గా పేరున్న నటి తమన్నా. ఈ మిల్కీ బ్యూటీ తన సరసన నటించాలని సాక్షాతు మెగాస్టార్ చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా ఆమెకు వరుస ఫ్లాప్‌లు వచ్చినప్పుడు కూడా మంచి ఆఫర్లే వచ్చాయి. బాగానే బిజీగా గడిపింది. కానీ ప్రస్తుతం హిట్ చిత్రాలలో నటిస్తున్నా కూడా తాజాగా ఈ భామకు టాలీవుడ్‌లో అవకాశాలు కరువయ్యాయి. ఆమె నటించిన 'బెంగాల్‌టైగర్', 'ఊపిరి', 'బాహుబలి-ది బిగినింగ్' వంటి చిత్రాలు బాగా ఆడాయి.
ఆమె నటనను కూడా మెచ్చుకున్నారు. కాగా ప్రస్తుతం ఆమె 'బాహుబలి2'లో కనిపిస్తుందా? కనిపించినా ఎంత సేపు? అనే క్యూరియాసిటీ ఉంది. ఎందుకంటే ఆమె పాత్ర 'బాహుబలి1'లోనే దాదాపు పూర్తయింది. 'బాహుబలి-ది కన్‌క్లూజన్'లో దేవసేనగా నటిస్తున్న అనుష్క పాత్రే కీలకం. మరోపక్క తమిళంలో ఆమె శింబు సరసన 'ట్రిపుల్ ఎక్స్' చిత్రంలో నటిచంచింది. ఈ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. ఇక ఆమె చియాన్ విక్రమ్ సరసన నటిస్తున్న 'స్కెచ్' చిత్రం షూటింగ్ సగానికి పైగా పూర్తయింది.
మరోపక్క ఆమెకు బాలీవుడ్‌లో మరలా జాన్ అబ్రహం చాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ 'అభినేత్రి' టాలెంట్ ఇక టాలీవుడ్‌కు చాలనుకుంటున్నారా? లేక ఆమెకు అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నారో మాత్రం అర్ధం కావడం లేదు. ఇక ఆమె ఎన్నో ఆశలు పెట్టుకున్న తమిళ, తెలుగు భాషల్లో రీమేక్ కానున్న 'క్వీన్' చిత్రంలో కూడా ఆమె పాత్రను 'గురు' ఫేమ్ రితికాసింగ్ కొట్టుకొని పోవడం గమనార్హం.