విది వక్రీకరిస్తే ఎలా ఉంటుందో సెటైర్ దర్శకుడైన శ్రీనువైట్లను చూస్తే అర్ధమవుతుంది. ఒకానొక టైంలో తిరుగేలేని విధంగా తాను ఆడింది ఆట.. పాడింది పాట అనే విధంగా ఆయన స్థితి ఉండేది. కానీ 'ఆగడు' నుంచి కష్టాలు మొదలయ్యాయి. ఇక మెగాకాంపౌండ్ అండదండలతో చరణ్ చిత్రం 'బ్రూస్‌లీ' చాన్స్ దక్కించుకోవడమేకాదు.. అందులో ప్రత్యేక పాత్రలో చిరుని నటింపజేసి హిట్ కొట్టాలని కసిగా తీశాడు. కానీ ఫలితం మారలేదు.
ఇప్పుడు మరో మెగాహీరో వరుణ్‌తేజ్‌ను ఒప్పించి, బన్నీ చలవతో 'మిస్టర్' తీశాడు. కానీ 'ఆగడు, బ్రూస్‌లీ' చిత్రాలు ఫ్లాపయినా ఆయన రెమ్యూనరేషన్ ఆయనకు వచ్చింది. కానీ 'మిస్టర్' సినిమాపై నమ్మకంతో తనకు రెమ్యూనరేషన్ వద్దని, బడ్జెట్ 20కోట్లు దాటి నష్టాలు వస్తే తానే తీరుస్తానని అగ్రిమెంట్ మీద సంతకం చేశాడని సమాచారం. ఇప్పుడు ఈ చిత్రం అందరికీ తీవ్ర నష్టాలను మిగిల్చింది. విదేశాలలో కాకుండా తెలుగు రాష్ట్రాలలోని అందమైన లోకేషన్స్‌నే నమ్ముకుని ఉంటే బాగుండేది. కానీ నిర్మాతల చేత 20కోట్లు పైగానే ఖర్చుపెట్టించాడు. దాంతో ఇప్పుడు ఆయన ఆ నష్టాలను భర్తీ చేసేందుకు తన సొంత ఆస్తులు కూడా అమ్ముకున్నాడట. ఇక ఈ చిత్రం విడుదలకు ముందు ప్రమోషన్స్‌తో హడావుడి చేసిన ఆయన ప్రస్తుతం పెద్దగా కనిపించడం లేదు.