తెలుగు ఆడియన్స్‌లో, మేకర్స్‌లో విలన్ అంటే బాడీబిల్డ్ చేసుకుని, కండలు పెంచి క్రూరంగా కనిపించాలనే తలంపు పోయినట్లు లేదు. గతంలో రావుగోపాలరావు, నూతనప్రసాద్, కోటశ్రీనివాసరావు నుంచి కేవలం హావభావాలతోనే విలనీని మెప్పించిన కమెడియన్లు అల్లు రామలింగయ్య, నగేష్ వంటి వారు కూడా ఉన్నారు. ఇక తాజాగా అరవింద్‌స్వామి 'ధృవ'లో అదరగొట్టాడు. ఇక హీరోలు విలన్లుగా నటించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. కమల్‌హాసన్ నుంచి రజనీకాంత్ వరకు ఎందరో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు పోషించారు. కేవలం హావభావాలతోనే విలనీని, క్రూరత్వాన్ని చూపించి మెప్పించారు.
ఇక తాజాగా ఎన్టీఆర్ 'జై లవ కుశ'లో ఓ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కోసం ముందుకు రావడం అభినందనీయం. కాగా ఈ పాత్ర మేకప్ కోసం హాలీవుడ్ వారిని రప్పించారు. ఇప్పటికే ఎన్టీఆర్ మాస్క్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇంకా ఇది ఫైనల్ గెటప్ కాదని, మరింత క్రూరంగా ఎన్టీఆర్ లుక్ ఉండనుందని సమాచారం. ఓకే మంచి గెటప్‌లో కనిపిస్తే బాగుంటుంది. కానీ మేకప్‌ల కన్నా ముఖకవళికలు, బాడీలాంగ్వేజ్ నుంచి డైలాగ్ డెలివరీలో విలనీజం చూపిస్తే .. అది ఇంకా గొప్పగా ఉంటుంది. మరి ఎన్టీఆర్ అందుకు అర్హుడనే భావిద్దాం....!