Advertisement
Google Ads BL

బాబు, కేసీఆర్‌లు ఒకే వ్యూహంతో..!


ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న టిడిపి, తెలంగాణలో అధికారంలో ఉన్న టిఆర్‌ఎస్‌లు ముందస్తు ఎన్నికల ప్లాన్‌ అమలు చేస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఏపీలో టిడిపిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోందనేది నిజం. దీంతో ఆల్‌రెడీ తనపై నక్సలైట్ల దాడి జరిగినప్పుడు సానుభూతి పవనాలు తనకు అనుకూలిస్తాయని ఆశించిన చంద్రబాబు ఈసారి కూడా మరోసారి అదే బాటలో నడవనున్నాడు. ఏపీలో వైయస్సార్‌సీపీ ఇంకా ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్‌ చేసుకోలేక పోతుండటం, జగన్‌పై మరలా కేసుల విచారణ మొదలవ్వడం, మరోవైపు జనసేన ఇప్పుడిప్పుడే బలపడే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలు బలపడకముందే ఎన్నికలకు వెళ్లాలనేది బాబు వ్యూహంగా కనిపిస్తోంది. 

Advertisement
CJ Advs

దీంతో మంత్రి బాధ్యతలు ఇచ్చామనే సాకుతో నారాలోకేష్‌, కళావెంకట్రావ్‌లపై నమ్మకం లేక పార్టీ పగ్గాలను కూడా తానే తీసుకొని, ఎక్కువ సమయం పార్టీకి కూడా కేటాయిస్తానని బాబు చెబుతున్నాడు. మరోపక్క తెలంగాణలో కూడా కాంగ్రెస్‌ క్రమంగా పుంజుకుంటూ ఉండటం, పవన్‌తో గద్దర్‌ కలవడం, బిజెపి వ్యూహాల నేపథ్యంలో ఇప్పటివరకు సరైన ప్రతిపక్షాన్ని ఎదుర్కోని కేసీఆర్‌ కూడా ఇదే వ్యూహాన్ని అనుసరిస్తుండటం విశేషం..! మరి వీరు తమ వ్యూహాలను ఎలా రచిస్తారో..? ఎప్పుడు ఎన్నికలు తమకు అనుకూలమని భావిస్తారో అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఇక జనసేనతో పాటు రెండు రాష్ట్రాలలోని ప్రతిపక్ష పార్టీలు కూడా ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్దమని ప్రకటించడం గమనార్హం. 

TDP and TRS Common Strategy for 2019 Elections :

Common strategy of the ruling parties TDP and TRS in Andhra Pradesh and Telangana for 2019 Elections.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs