Advertisement
Google Ads BL

'బాహుబలి 2' కి లైన్ క్లియర్..!


బాహుబలి 2 చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుడలకు సిద్ధమవుతుండగా కన్నడలో మాత్రం కొద్దిగా విడుదల ఇబ్బందులు ఎదుర్కొంటుంది. బాహుబలి లో కట్టప్పగా నటించిన సత్యరాజ్ వల్ల కన్నడలో విడుదల కష్టాల్లో పడింది బాహుబలి 2. కావేరి జలాల సమస్యపై సత్యరాజ్ గతంలో చేసిన వ్యాఖ్యలకు కన్నడ ప్రజలు ఇప్పుడు బాహుబలి2 విడుదలపై కత్తి కట్టారు. సత్యరాజ్ నటించిన బాహుబలి ద కంక్లూజన్ చిత్రాన్ని విడుదల కనివ్వబోమని వారు రచ్చ రచ్చ చేశారు. ఇక డైరెక్టర్ రాజమౌళి వారిని కన్నడ భాషలో వేడుకున్నా పనిజరగలేదు. ఇక సత్యరాజ్ వారికి ఎట్టకేలకు బహిరంగ క్షమాపణ చెప్పాడు. అయినా కన్నడ ప్రజా సంఘాలు నిన్నటి నుండి కట్టప్ప సత్యరాజ్ క్షమాపణలు ఒప్పుకున్నట్టు కనబడలేదు.

Advertisement
CJ Advs

కానీ ఈ రోజు శనివారం కన్నడ సంఘాలు సత్యరాజ్ ఇక జీవితంలో కన్నడ ప్రజల గురించి మాట్లాడ కూడదనే కండీషన్ పెట్టి బాహుబలి 2ని విడుదల చేసుకోవచ్చని చెప్పింది. ఇక కన్నడ ప్రజా సంఘాలు శాంతించి బాహుబలి విడుదలకు లైన్ క్లియర్ చేశాయి. వారు అలా చెప్పారో లేదో ఇక్కడ బాహుబలి టీమ్ ఊపిరి పీల్చుకుంది.విడుదల సమయంలో ఈ గందర గోళానికి బాహుబలి టీమ్ కాస్త టెన్షన్ పడింది. ఇక ఇప్పుడు మాత్రం బాహుబలి విడుదలకు లైన్ క్లియర్ అవడంతో ఊపిరి పీల్చుకుని హ్యాపీగా వుంది.  బాహుబలి 2 మరో ఏడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Baahubali 2- Release Problems Cleared:

<span>After Tamil actor Sathyaraj offered an unconditional apology on Friday for his controversial statements which he had made years ago, former MLA Vatal Nagaraj has declared that there will be no obstructions in the peaceful release of 'Baahubali 2: The Conclusion' in Karnataka.&nbsp;</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs