ఈ మధ్యన ఏ సినిమా ఫస్ట్ లుక్ వదిలినా అది వేరే సినిమా లుక్ తో ముడిపెట్టి మన దర్శకులు కాపీ కొడుతున్నారని విమర్శలు సినిమా ఇండస్ట్రీలో రోజు రోజుకి పెరిగిపోతోంది. బాహుబలి విషయమే తీసుకోండి బాహుబలి లుక్ వదిలిన ప్రతిసారి అది ఏ హాలీవుడ్ సినిమాలో లుక్కో అంటూ సోషల్ మీడియాలో ఊదరగొట్టేస్తున్నారు. ఇటువంటి సమయంలో దర్శకులు తగు జాగ్రత్తలు తీసుకుని ఇతర సినిమా లుక్ తో పోలిక లేకుండా కొంచెం డిఫ్రెంట్ గా ఉండేందుకు ట్రై చేస్తూనే వున్నారు. అయినా ఎక్కడో ఒక చోట తేడా కొడుతూనే వుంది. ఇక ఇప్పుడు ఈ సోదంతా ఎందుకంటే... డీజే లుక్ గురించి సోషల్ మీడియాలో తెగ సెటైర్స్ పడుతున్నాయి.
ఈ రోజు శనివారం 'డీజే... దువ్వాడ జగన్నాథం' చిత్రం జూన్ 23న రిలీజ్ అంటూ... అల్లు అర్జున్ సూట్ కేసు పట్టుకుని స్టయిల్ గా నడిచి వెలుతున్న పోస్టర్ ని ఒకటి చిత్ర యూనిట్ మీడియాకి విడుదల చేసింది. ఇప్పటివరకు డీజే ఫస్ట్ లుక్ లో సెకండ్ లుక్ లోను అల్లు అర్జున్ ని బ్రాహ్మణుడి గెటప్ లో చూపించిన హరీష్ శంకర్ ఇప్పుడు అల్లు అర్జున్ ని మంచి స్టైల్ లుక్ లో చూపించి బన్నీ అభిమానులకు బూస్ట్ ఇచ్చాడు. ఈ లుక్ లో అల్లు అర్జున్ అదిరిపోయాడని మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
అయితే బన్నీ యాంటీ ఫ్యాన్స్ మాత్రం డీజే లుక్ ని నిశితంగా పరిశీలిస్తే మీకు ఆ లుక్ ఎక్కడో చూసిన ఫీలింగ్ కలుగుతుందంటూ సెటైర్స్ స్టార్ట్ చేశారు. ఇదివరకు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక చిత్రంలో ఇలా సూట్ కేస్ పట్టుకుని స్టైలిష్ లుక్ లో కనబడ్డాడు. ఇప్పుడు అల్లు అర్జున్ 'డీజే' లుక్ 'నాన్నకు ప్రేమతో' లో ఎన్టీఆర్ లుక్ తో పోలిక పెడుతూ సోషల్ మీడియాలో యాంటీ ఫ్యాన్స్ రెచ్చిపోతున్నారు. ఇక 'నాన్నకు ప్రేమతో' లో ఎన్టీఆర్ గెడ్డం పెంచి సైడ్ యాంగిల్ లో సూట్ కేసు తో కనబడ్డాడు.... ఇక ఇప్పుడు బన్నీ ఫుల్ యాంగిల్ లో అచ్చం అలాగే కనబడ్డాడని అంటున్నారు. ఇక తారక్ లుక్ ని బన్నీ కాపీ కొట్టేశాడంటూ యాంటీ ఫ్యాన్స్ అప్పుడే హంగామా మొదలు పెట్టేశారు.