విజయశాంతి తర్వాత పెద్దగా హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాల హవా తగ్గింది. అప్పుడప్పుడు వస్తున్నా కూడా పెద్దగా జనాదరణ పొందడం లేదు. కొందరు ఫేడవుట్ హీరోయిన్లు అలాంటి పాత్రలు చేస్తున్నా మెప్పించలేకపోతున్నారు. ఇక విజయశాంతి తర్వాత ఆస్థాయిలో మరలా యాక్షన్ సీన్స్ చేసి, మరీ ముఖ్యంగా కత్తులతో అదరగొట్టింది జేజమ్మ మాత్రమే. ఆమె 'అరుంధతి, రుద్రమదేవి'తో పాటు రానున్న 'బాహుబలి-ది కన్‌క్లూజన్'లో కూడా ఆమె నటించిన కత్తిఫైట్లు, యుద్దాలపై మంచి అంచనాలున్నాయి.
ఇక 'బాహుబలి-ది బిగినింగ్'లో మిల్కీ బ్యూటీ తమన్నా కూడా తాను అబలను కాదు.. సబలను అని చాటుతూ ఆయుధాలు పట్టి మెప్పించింది. ఇక ప్రస్తుతం తమిళంలో సుందర్‌సి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో 'సంఘమిత్ర' అనే చిత్రం రూపొందుతోంది. ఇందులో శృతిహాసన్ కీలకమైన పాత్రను చేస్తోంది. చిత్రంలో ఆమెపై కత్తి యుద్దాలు, ఫైట్స్ ఉంటాయట. దాంతో ఆమె ప్రస్తుతం లండన్‌లో కత్తి విద్యలో మెలకువలు నేర్చుకుంటోంది.
ఇక హిందీ స్టార్ హీరోయిన్లయిన కంగనారౌనత్, దీపికాపడుకొనే వంటి వారు అదే పనిలో ఉన్నారు. తాజాగా అక్కినేని ఫ్యామిలీకి కాబోయే కోడలు సమంత తన కర్రసాముతో షాకిచ్చింది. మొత్తానికి మన హీరోయిన్లు ఇప్పుడు పెద్ద పెద్ద ప్రయోగాలు, సాహసాలు చేయడానికి రెడీ అవుతుండటం ఆనందించదగ్గ విషయం.