ఒకప్పుడు తెలుగు చిత్రాలు ఎక్కువగా విదేశాలలో షూటింగ్‌లు జరుపుకునేవి కాదు. భారీ ఖర్చుతో కూడిన విషయం కావడంతో ఊటీ, కొడైకెనాల్, మెరీనాబీచ్‌లతో పాటు చిన్న చిన్న సెట్స్‌లో షూటింగ్స్ జరిపేవారు. చివరకు స్వర్గీయ ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్‌బాబు, కృష్ణ, కృష్ణంరాజు వంటి స్టార్స్ చిత్రాలు కూడా అదే సూత్రం ఫాలో అయ్యేవి. మెగాస్టార్ చిరంజీవి ఆనాడు తన బ్రేక్‌డ్యాన్స్‌లకు, మంచి మంచి డ్యూయెట్లకు కాశ్మీర్ అందాలను ఎక్కువగా ఇష్టపడేవాడు.
చలిలో, మంచు కొండల్లో డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిచ్చాడు. 'కాశ్మీర్ లోయలో కన్యాకుమారిలో...' అంటూ కాశ్మీర్ అందాలపై పాటలు కూడా పాడాడు. ఇక కాశ్మీర్‌లో అల్లర్లు పెరగడం, ప్రశాంతంగా షూటింగ్ చేసుకునే పరిస్థితులు లేకపోవడంతో పాటు విదేశాలలో షూటింగ్ కూడా చవకగా మారడం, సెట్స్‌కంటే విదేశాలలోని సహజసిద్దమైన ప్రదేశాలలో పాటల, సన్నివేశాల చిత్రీకరణ బాగుంటుందనే ఆలోచనలో విదేశాలలో షూటింగ్‌లు పెరిగాయి. ఇండియా స్విట్జర్లాండ్‌గా పిలువబడే కాశ్మీర్ జోలికి కొంతకాలంగా ఎవరూ వెళ్లడం లేదు.
ఇక మణిరత్నం తీసిన 'రోజా, ముంబై'లకు కాశ్మీర్ అందాల సహజసిద్దతని తెచ్చాయి. కాగా ఇటీవల మరలా మన దర్శకనిర్మాతలు, హీరోలు కాశ్మీర్‌పై ప్రేమ చూపిస్తున్నారు. మహేష్‌బాబు 'బ్రహ్మూెత్సవం', రామ్‌చరణ్ 'ధృవ', అల్లుశిరీష్‌ల 'శ్రీరస్తు శుభమస్తు' చిత్రాలు అక్కడ షూటింగ్ జరుపుకున్నాయి. ఇక తాజాగా బన్నీ త్వరలో వక్కంతం వంశీ దర్శకత్వంలో నటించనున్న 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' చిత్రంలోని ప్రధాన సన్నివేశాలను కశ్మీర్‌లో తీసేందుకు దర్శకుడు వక్కంతం అక్కడ ప్రదేశాల ఎంపికలో ఉన్నాడు.