కరీనా వయసు ఇప్పుడు దాదాపు 36 ఏళ్ళు. ఇప్పటికి కరీనా కపూర్ వన్నెతరగని అందంతో చూపరులకు మతిపోగొడుతోంది. సైఫ్ అలీ ఖాన్ ని పెళ్లి చేసుకుని ఒక బాబుకి తల్లైనా కూడా కరీనా మెరుపులు ఏమాత్రం తగ్గలేదు. ఆమె ప్రెగ్నెన్సీ తో ఉండి నెలలు నిండినా కూడా కెమెరా ముందుకు రావడానికి ఏ మాత్రం సంకోచించకుండా పలు యాడ్స్ లో, అవార్డ్స్ ఫంక్షన్స్ లో దర్శనమిచ్చింది. ఇక ఇప్పుడు డెలివరీ అయ్యాక కూడా కేవలం కొద్దీ రోజులు విరామం తీసుకున్న కరీనా మళ్ళీ జనాల ముందుకు వచ్చేసింది. అలాగే ఇప్పుడు కరీనా మళ్ళీ వెండితెర మీద కనిపించబోతుందట.
ఇక ఓ సినిమా కోసం బాలీవుడ్ బెబో గా పేరుగాంచిన కరీనా కి కళ్ళు తిరిగే ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. ఆ మొత్తం ఆఫర్ తెలిస్తే మనకు కళ్ళుతిరుగుతాయననుకోండి అది వేరే విషయం. ఆ చిత్రం కోసం కరీనాకు అక్షరాలా ఆరు కోట్ల ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. మరి పిల్లాడికి తల్లైనా కరీనా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదనడానికి ఇది నిదర్శనం. ఇక ఇప్పుడు కరీనా వయస్సు 36 ఏళ్ళు. ఈ చిత్రంలో కూడా కరీనా అదే వయస్సుకు తగ్గ పాత్రలో కనిపిస్తుందని సమాచారం.