ఎన్టీఆర్, బాబీ డైరెక్షన్ లో 'జై లవ కుశ' స్టార్ట్ చేసి శరవేగంగా షూటింగ్ జరిపేసుకుంటున్నాడు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ అన్న కళ్యాణ్ రామ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం లో ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. అందులో జై పాత్ర నెగెటివ్ షేడ్ వున్న పాత్ర కాగా... లవ పాత్ర ఒక బ్యాంక్ మేనేజర్ గా ఉండబోతుందని లీకైన పిక్స్ ద్వారా తెలుస్తుంది. ఇక మరో పాత్ర నాటకాల్లో వేషాలు వేసుకుంటూ సినిమాల్లో వేషాల కోసం ట్రై చేసే పాత్ర అని ప్రచారం జరుగుతుంది.
ఇక ఈ చిత్రంలో ఇప్పటికి ఇద్దరు హీరోయిన్స్ గా రాశి ఖన్నా, నివేత థామస్ లు ఎంపిక కాగా ఇప్పుడు మరో హీరోయిన్ కూడా సెట్ అయిందనే వార్తలు ప్రచారమవుతున్నాయి. 'ప్రేమకథా చిత్రమ్'తో మంచి ఫామ్ లోకొచ్చిన నందిత రాజ్ 'జై లవ కుశ' లో ఒక చిన్న కేరెక్టర్ చేస్తుందని అంటున్నారు. ఆమెది చిన్న పాత్రే అయినా ఆమె కేరెక్టర్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని.... కథకు కీలకంగా, ప్రేక్షకులకు సర్ప్రైజింగా ఉంటుందని... అందుకే ఇప్పటి వరకు నందిత గురించి సీక్రెట్ మెయింటింగ్ చేశారని చెబుతున్నారు. ఇక నందిత పాత్ర తాలూకు సన్నివేశాలు కూడా ఇప్పటికే షూటింగ్ పూర్తయిపోయిందని సమాచారం అందుతుంది. ఇక జై లవ కుశ చిత్రాన్ని ఆగష్టు కల్లా పూర్తి చేసి ఆ వెంటనే విడుదల చెయ్యడానికి సన్నాహాలు మొదలు పెట్టారు.