'బాహుబలి ద కంక్లూజన్' చిత్రం విడుదలకు రోజులు దగ్గరపడుతున్న కొద్దీ ప్రేక్షకుల్లో క్యూరీయాసిటీ పెరిగిపోతుంది. తెలుగు, తమిళం, బాలీవుడ్ భాషల్లో ఈ నెల 28 అంటే వచ్చే శుక్రవారమే బాహుబలి చిత్రం విడుదలైపోతుంది. కానీ కన్నడంలో మాత్రం బాహుబలికి విడుదల కష్టాలు మొదలయ్యాయి. బాహుబలిలో కట్టప్పగా నటించిన సత్యరాజ్ కావేరి జలాలపై చేసిన వ్యాఖ్యలతో కన్నడీగులు ఇప్పుడు బాహుబలి పై పగబట్టారు. ఎట్టి పరిస్థితుల్లో బాహుబలి చిత్రాన్ని కన్నడలో విడుదల కానివ్వమని వాళ్లు కంకణం కట్టుకుని కూర్చున్నారు.
అయితే బాహుబలి డైరెక్టర్ రాజమౌళి మాత్రం కన్నడీగుల కోపాన్ని పోగొట్టడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. అసలు సత్యరాజ్ కి బాహుబలి నిర్మాణానికి సంబంధం లేదని కేవలం ఆయనొక నటుడు మాత్రమే అని.... ఈ మూవీకోసం ఎంతోమంది నటీనటులు, సాంకేతిక నిపుణులు కష్టపడి పని చేశారు. ఈ చిత్రం రిలీజ్ ను అడ్డుకుంటే వాళ్ళంతా ఎంతో నష్టపోవలసి వస్తుంది. బాహుబలి పార్ట్ 1 ని ఆదరించిన మీరు ఇలా బాహుబలి పార్ట్ 2 ని అడ్డుకోవడం కరెక్ట్ కాదని.... వాళ్ళని వేడుకుంటూ కన్నడలో స్పీచ్ ఇచ్చిన వీడియో ఒకదానిని రాజమౌళి యూట్యూబ్ లో పోస్ట్ చేసాడు.
మరి రాజమౌళి చెప్పింది అక్షరాలా నిజం. ఎందుకంటే సత్యరాజ్ వ్యాఖ్యలకు బాహుబలి విడుదలకు అస్సలు సంబంధం లేదు. అసలు బాహుబలిలో ఆయన నటించాడే కానీ ఆ సినిమా తెరకెక్కించడం, నిర్మించడం వంటి అంశాలతో సత్యరాజ్ కి ఎటువంటి సంబంధం లేదు. వేలమంది కష్టంతో తెరకెక్కిన సినిమాని ఒక్క నటుడి కోసం ఆపేయాలని చూడడం కరెక్ట్ కాదనే వాదన ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ నుండి వినబడుతుంది.