Advertisement
Google Ads BL

మన స్టార్స్‌ పిసినారులుగా మారుతున్నారు..!


మన స్టార్స్‌ చిత్రాలంటే కొట్లతో ముడిపడిన వ్యవహారం. కుటుంబ కథాచిత్రాలకు కూడా వందలకోట్లు కుమ్మరిస్తున్నారు. తమ పారితోషికాలు మాత్రం ఆకాన్నంటుతూనే ఉన్నాయి. ఇక సంగీతం కోసం.. ఇతర మేకప్‌, సినిమాటోగ్రఫీ వంటి విషయాలల్లో నిర్మాతల చేత భారీగానే ఖర్చు చేయిస్తున్న మన స్టార్స్‌ హీరోయిన్ల విషయంలో మాత్రం పొదుపు మంత్రం పాటిస్తున్నారు. స్టార్‌ హీరోయిన్లను పెట్టుకోవాలంటే కోట్లు ఖర్చుచేయాలి. అందునా మన స్టార్స్‌కి ఇద్దరు హీరోయిన్లు లేనిదే ముద్దదిగదు. 

Advertisement
CJ Advs

ఆ ఊపు రాదు. ఇక అభిమానులు కూడా ఎవరైతే మాకేంటి కొత్త అందాలు కావాలంటున్నారు. తమ స్టార్‌ నటిస్తే చాలని, తెరనిండా ఆయన ఒక్కడే కనిపించాలని, వారి పక్కన జోడీగా ఎవరున్నా.. నో ప్రాబ్లం అని గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేస్తున్నారు. దాంతో మన స్టార్స్‌ హీరోయిన్ల విషయంలో మాత్రం డబ్బు జాగ్రత్త చేస్తూ దుబారా కాకుండా నిర్మాతలకు రెండు మూడు కోట్లు తగ్గిస్తున్నారు. ఇక పవన్‌ హీరోగా త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్న చిత్రంలో పెద్దగా తెలుగులో స్టార్స్‌ కానటువంటి కీర్తి సురేష్‌, అను ఎమ్మాన్యుయేల్‌లు నటిస్తున్నారు. 

కీర్తికి ఇంకా స్టార్‌ హోదా టాలీవుడ్‌లో రాలేదు. ఆమె ఇప్పటివరకు కేవలం మీడియం రేంజ్‌ హీరోలైన రామ్‌, నాని ల సరసనే నటించింది. దీంతో ఈ చిత్రానికి ఆమె అతి తక్కువ రెమ్యూనరేషన్‌కే ఓకే చేసిందట. ఇక అను పరిస్థితి కూడా అదే. ఇక యంగ్‌టైగర్‌ సైతం తన 'జై లవ కుశ' కోసం అన్నయ్య నందమూరి కళ్యాణ్‌రామ్‌ను ఇబ్బంది పెట్టడం లేదు. ఈ చిత్రం కోసం పెద్దగా పేరులేని రాఖిఖాన్నా, నివేదాథామస్‌లతో సరిపెట్టుకుంటున్నాడు. ఇక యంగ్‌రెబెల్‌స్టార్‌ ప్రభాస్‌తో పాటు స్టార్‌ హీరోయిన్లను పెట్టుకునే అలవాటున్న మహేష్‌బాబులు సైతం సుజీత్‌ దర్శకత్వంలో చేయబోయే 'సాహో', కొరటాలతో చేయబోయే 'భరత్‌ అను నేను' చిత్రంలో పెద్దగా పారితోషికం గురించి బెట్టు చేయకపోవడంతో కైరా అద్వానీల వైపు చూస్తున్నారట. ఈ విధంగా యువి క్రియేషన్స్‌ అధినేతలకు, దానయ్యలు బాగానే మిగులుస్తున్నారు. వీరి మార్పు పుణ్యమా అని కొత్తవారు రాబోయే రోజుల్లో స్టార్‌ హీరోయిన్లుగా హవా చాటే యత్నంలో మునిగి ఉన్నారు. 

Our stars are changing PCs..!:

In our Stars heroines matters, we have a mantra.Costs are to be spent on star heroes.Fans also want to have new Beauties.No problem is given the green signal Pawan's movie is being produced by Radhakrishna in Trivikram Srinivas's direction Stars of non-stars are acting Keerthy Suresh, an Emmanuel
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs