Advertisement
Google Ads BL

సమంత కర్రతో చంపేస్తాదట..!


సుకుమార్ - రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రం కొల్లేరు, రాజమండ్రి పరిసర ప్రాంతాలలో షూటింగ్ జరుపుకుంటుంది. మొదటి నుండి ఈ చిత్రం పల్లెటూరి ప్రేమ కథ చిత్రంగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ ఊర మాస్ లుక్ లో కర్ర సాము గట్రా చేస్తూ పల్లెటూరి యువకుడిగా, చెవిటివాడిగా కనిపిస్తాడని అంటున్నారు. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ కి జోడిగా సమంత నటిస్తుండగా... రామ్ చరణ్ కి మరదలిగా హాట్ యాంకర్ అనసూయ నటిస్తుంది. 

Advertisement
CJ Advs

అయితే ఇప్పుడు సమంత కొత్తగా కర్రసాము ప్రాక్టీస్ చేస్తూ జిమ్ లో యమా బిజీగా వుంది. కర్ర తిప్పడంలో ఏ ఒక్క అబ్బాయికి తీసిపోని లెవల్లో సమంత కర్రసాము నేర్చుకుంటుంది. ఇక సమంత కర్రసాము నేర్చుకుంటున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. మరి రామ్ చరణ్ చిత్రంలో సమంతకి ఈ కర్రసాము పని ఎమన్నా పడిందా.... అందుకే సమంత ఇలా కర్రసాము ప్రాక్టీస్ లో గడిపేస్తుందని... అంటున్నారు. అయితే సమంత మాత్రం కేవలం హాబీగా మాత్రమే కర్రసాము నేర్చుకుంటున్నానని చెబుతుంది.

ఏదిఏమైనా ఇపుడు సమంత కష్టపడి నేర్చుకుంటున్న కర్రసాము గురించే ఫిలిం సర్కిల్స్ లో హాట్ టాపిక్ అంతా. మరి మనం పూర్తి స్థాయిలో సమంత కర్రసాము చూడాలంటె రామ్ చరణ్ చిత్రం పూర్తయ్యేవరకు వేచి చూడాలో లేక ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తున్న వీడియో ఒక్కటేనో ప్రస్తుతానికి సస్పెన్స్.

He Wants to Kill Samantha with a Stick!:

<span>Samanta is a busy bee of late with interesting lineup of films on professional side and marriage with Naga Chaitanya to happen soon on personal side.</span> <span>&lsquo;Because I like a challenge, new hobby is Silambam. Can&rsquo;t wait to get better at this,&rsquo;Samanta said.</span> <span>she might be performing this art in upcoming rural back drop romantic flick RC11besides Ramcharan</span>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs